Actress: ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.?

Childhood Photo of South Indian Actress Nazriya Nazim Goes Viral
x

Actress: ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? 

Highlights

Actress: ఇటీవల నెట్టింట సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ చైల్డ్‌ హుడ్‌ ఫొటోలను అబిమానులతో పంచుకుంటున్నారు.

Actress: ఇటీవల నెట్టింట సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ చైల్డ్‌ హుడ్‌ ఫొటోలను అబిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పైన ఫొటోలో బొద్దుగా, అమాయకంగా కనిపిస్తున్న ఆ పాప ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటిగా ఎదిగింది. అంతేకాదు ఈ బ్యూటీ ఓ ప్రముఖ హీరోకు భార్య కూడా.

ఇంతకీ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఈ క్యూట్‌ గర్ల్‌ మరెవరో కాదు అందాల తార నజ్రియా నాజిం. మలయాళ చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించిన నజ్రియా, "రాజా రాణి" మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా నుంచే తన చక్కటి అభినయం, ముద్దుగా కనిపించే ఎక్స్‌ప్రెషన్లతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. టాలీవుడ్‌ లోనూ ఆమెకే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

"అంటే సుందరానికి" సినిమా ద్వారా తెలుగులో నటించిన నజ్రియా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. నజ్రియా భర్త ఫహద్ ఫాజిల్ కూడా టాలీవుడ్‌లో పుష్ప సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పుష్ప-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్న ఫహద్‌, తన యాక్టింగ్‌కు సంబంధించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే నజ్రియా చిన్న నాటి ఫొటో తాజాగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories