OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రడీ.. ఈ వారం అదిరిపోయే చిత్రాలు వచ్చేస్తున్నాయ్‌..!

Check these movies and web series Releasing in Aha Amazon and Netflix this weekend on OTT Platforms
x

OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రడీ.. ఈ వారం అదిరిపోయే చిత్రాలు వచ్చేస్తున్నాయ్‌..!

Highlights

OTT Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు.. థియేటర్లలో సినిమాల హడావుడి నెలకొంది. కానీ, ఇప్పుడు ఇంట్లో కూడా వీకెండ్ వస్తుందంటే సినిమాల హంగామా మొదలవుతోంది.

OTT Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు.. థియేటర్లలో సినిమాల హడావుడి నెలకొంది. కానీ, ఇప్పుడు ఇంట్లో కూడా వీకెండ్ వస్తుందంటే సినిమాల హంగామా మొదలవుతోంది. అలాగే, ఓటీటీలోనూ రిలీజ్‌ల జాతర కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీలో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ఓసారి చూద్దాం..

* అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జంటగా సందడి చేసిన ‘మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా థియేటర్స్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన కథా, కామెడీ టైమింగ్‌తో నవ్వులు కురిపించిన ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

* అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఓ మై గాడ్‌2 సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో‌ అక్టోబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో నిర్మించిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్‌’ అనే మూవీ ఆహా వేదికగా అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమా కూడా అక్టోబరు 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

* అక్టోబర్‌ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'బెక్‌హమ్'‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఎవ్రీథింగ్‌ నౌ అనే వెబ్‌ సిరీస్‌ అక్టోబర్‌ 5 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

* ఫెయిర్‌ ప్లే, ఇన్సిడియస్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు అక్టోబర్‌ 6 నుంచి ‌స్ట్రీమింగ్ కానున్నాయి.

* అలాగే అక్టోబర్‌ 6 నుంచి 'ముంబై డైరీస్‌' అనే బాలీవుడ్‌ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమిగ్‌ కానుంది.

* జీ5 ఓటీటీలో బాలీవుడ్‌ సినిమా 'గదర్‌ 2' అక్టోబర్ 6 నుంచి చూడొచ్చు.

* ఇప్పటికే అంటే అక్టోబర్ 4 నుంచి 'హంటెడ్‌ మాన్షన్'‌ డిస్నీ + హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అక్టోబర్ 6 నుంచి 'లోకి' అనే వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది.

* అక్టోబర్ 6 నుంచి 'గుష్‌పతి – బిట్వీన్‌ బోర్డర్స్‌' అనే హిందీ సినిమా జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే, అక్టోబర్ 7 నుంచి 'ది డాటర్‌' అనే హిందీ సినిమా కూడా స్ట్రీమింగ్‌ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories