Chaurya Paatam: సింపుల్ ప్ర‌శ్న‌ల‌కు ఆన్సర్ చెప్పండి.. ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్ టికెట్లు గెల‌వండి..!

Chaurya Paatham Movie Offers Free IPL Tickets Answer Simple Questions to Win
x

Chaurya Paatam: సింపుల్ ప్ర‌శ్న‌ల‌కు ఆన్సర్ చెప్పండి.. ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్ టికెట్లు గెల‌వండి..!

Highlights

Chaurya Paatam: సినిమా ప్ర‌మోష‌న్స్ రోజుకో కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ర‌క‌ర‌కాల మార్గాల్లో సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు.

Chaurya Paatam: సినిమా ప్ర‌మోష‌న్స్ రోజుకో కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ర‌క‌ర‌కాల మార్గాల్లో సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు. తాజాగా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నా కొత్త సినిమా స‌రికొత్త ప్ర‌మోషన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అదే చౌర్య పాఠం. ఈ నెల 25వ తేదీన విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ స‌రికొత్త ప్ర‌మోష‌న్స్‌ను తెర తీసింది.

ప్ర‌స్తుతం న‌డుస్తోన్న ఐపీఎల్ సీజ‌న్‌ను చిత్ర యూనిట్ త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు అనుకూలంగా మార్చుకుంది. ఐపీఎల్ టికెట్స్ ను ఉచితంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 23న హైదరాబాద్ లోని ఉప్పల్ వెదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సినిమా టికెట్ల‌ను ఉచితంగా పొందే అవ‌కాశాన్ని క‌ల్పించారు.

ఐపీఎల్ టికెట్స్ ను ఉచితంగా ఇస్తామని చౌర్య పాఠం చిత్ర యూనిట్ ప్ర‌టించింది. ఇందుకోసం చిన్నకాంటెస్ట్ నిర్వహించారు. 5 ప్ర‌శ్న‌ల‌కు సంధించారు. వాటికి స‌మాధానాల‌ను వాట్సాప్ నెంబర్‌కు పంపించ‌మ‌ని తెలిపారు. ట్రైల‌ర్ చూడ‌డం ద్వారా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెల‌పొచ్చ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఇక సినిమా విష‌యానికొస్తే.. ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. స‌రికొత్త విధానంలో సినిమాను టప్ర‌మోట్ చేస్తున్న చౌర్య పాఠం ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories