Actress: చంద్రముఖి మూవీలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా.? షాక్‌ అవ్వాల్సిందే

Chandramukhi Child Artist Praharshitha Srinivasan Then and Now
x

Actress: చంద్రముఖి మూవీలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా.? షాక్‌ అవ్వాల్సిందే

Highlights

Actress: రజినీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Actress: రజినీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హారర్‌ కామెడీగా వచ్చిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ సినిమాలో నటించిన బాలనటి ప్రహర్షిత శ్రీనివాసన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రహర్షిత శ్రీనివాసన్ ఒకరు.

చంద్రముఖి మూవీతో ప్రహర్షితకు తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా మంచి గుర్తింపు వచ్చింది. చంద్రముఖి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రహర్షిత, ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా తన నటనను కొనసాగించింది. అయితే, తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలోనూ నటించలేదు. ఇన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత, ఇప్పుడు పూర్తిగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది.

2021లో వివాహం చేసుకున్న ఆమె, 2022లో ఓ పాపకు జన్మనిచ్చింది. కుటుంబ బాధ్యతలతో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సీరియల్స్‌తో మళ్లీ బిజీ అయ్యింది. ఇప్పుడు ప్రహర్షిత, బుల్లితెర సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఫోటోషూట్స్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. చిన్నప్పుడు బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఓ కాలంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించిన ప్రహర్షిత, ప్రస్తుతం బుల్లితెర మీద తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories