Chandra Babu Naidu: కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది...!

* సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసినట్లయిoది

R Tripura Malini
Updated on: 15 Nov 2022 8:57 AM IST
Chandrababu Naidu Tweets About Superstar Krishna
X

 కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది

N Chandrababu Naidu: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసినట్లయిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా నిర్మాతల హీరోగా నటశేఖరుడిగా సూపర్‌స్టార్‌గా పిలిపించుకున్న నటుడు మాజీ ఎంపీ కృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారాయన నటుడిగా దర్శకుడిగా తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కష్ణ పేరు చెప్పుకుంటారని అన్నారు.

ఇటీవలే తల్లిని తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‌బాబుకు తీరని వేదన అన్నారు చంద్రబాబు ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మహేశ్‌బాబుకు ఇవ్వాలని భగవంతుడుని కోరుకుంటున్నానని బాబు ట్వీట్ చేశారు. కృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ బాడు ట్వీట్ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story