సైరా ఎఫెక్ట్ చాణక్య మీదా మాములుగా పడలేదుగా

సైరా ఎఫెక్ట్ చాణక్య మీదా మాములుగా పడలేదుగా
x
Highlights

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుండే సినిమాకి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా...

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుండే సినిమాకి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా దూసుకుపోతుంది. సైరా విడుదలైన మూడు రోజులకు గోపీచంద్ చాణక్య విడుదలైంది. సైరాకి పోటిగా ఈ సినిమా రావడంతో గోపీచంద్ ఎదో మ్యాజిక్ చేయబోతున్నాడని అని అందరు అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా సినిమా ఉంది. మొదటి ఆటకే సినిమా ఏంటో తేలిపోయింది. సైరాని రెండో సారి చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడ్డారు కానీ చాణక్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు ప్రేక్షకులు..

దీనితో చాణక్య వసూళ్ళ పరంగా చాలా వెనుకబడిపోయింది. మొత్తం ఆరు రోజులకు గాను చాణక్య రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల రూపాయల షేర్ ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 3.9 కోట్ల రూపాయల షేర్, 6.6 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 12 కోట్ల వరకు జరిగింది. అంటే దాదాపు 70 శాతాన్ని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయరు అన్నమాట.. దీనితో గోపీచంద్ సోలోగా వస్తే కనీసం సేఫ్ జోన్ ఆయినే వెళ్లి ఉండే వాడు కదా అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories