సుడిగాలి సుదీర్ పై వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయిన చలాకి చంటి

*సుడిగాలి సుదీర్ పై వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయిన చలాకి చంటి

Rama Rao
Published on: 26 Oct 2022 8:12 PM IST
Chalaki Chanti Reacts to the Rumors about Sudigali Sudheer
X

సుడిగాలి సుదీర్ పై వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయిన చలాకి చంటి

Chalaki Chanti: ప్రస్తుతం బుల్లితెర లో జబర్దస్త్ కామెడీ షోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్ వెండితెరపై కూడా పరిచయమయ్యారు. ఎందరో టాలెంట్ ఉన్న కమీడియన్లకు జబర్దస్త్ ఒక అద్భుతమైన ప్లాట్ఫారం గా మారింది. సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, తదితరులు జబర్దస్త్ నుండి క్రేజ్ సంపాదించి ఇప్పుడు నటులుగా కూడా సెటిల్ అయ్యారు. అయితే గత కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు.

షో నుంచి ఆయనను తీసేసారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా చలాకీ చంటి ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు.ఈ మధ్యనే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయి వచ్చేసిన చలాకీ చంటి సుధీర్ విషయం గురించి మాట్లాడుతూ, "జబర్దస్త్ వారు సుదీర్ ను చాలా రకాలుగా ప్రోత్సహించారు. అతను కారు, ఇల్లు కొనుక్కోవడానికి, ఫారిన్ వెళ్లడానికి కూడా సహాయపడ్డారు. అలాంటిది వాళ్లు సుదీర్ ని తీసేసినట్లు నేను విన్నాను. నాకు కూడా చాలా బాధ అనిపించింది.

కానీ కంపెనీకి సుధీర్ కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ సమయంలో నేనక్కడ లేను. రెండు కారణాల వల్ల సుదీర్ ని తీసేసారని కొందరు అంటున్నారు. కానీ అవేంటో కూడా నాకు తెలియదు. కళ్ళతో చూస్తే నేను చెప్పే వాడిని కానీ ఎవరో చెప్పిన దానిని నమ్మి చెప్పే రకం కాదు. కానీ ఇటు సుదీర్ ని కానీ అటు కంపెనీ వారిని తప్పు పట్టలేము. ఎవరిష్టం వాళ్లది," అని చెప్పుకొచ్చారు చలాకి చంటి.

Rama Rao

Rama Rao

Next Story