Chaava Movie:మార్చి 7 నుంచి తెలుగులో ఛావా.. గుడ్ న్యూస్ చెప్పిన గీతా ఆర్ట్స్

Chaava Movie Telugu Version Is Releasing On March 7th
x

మార్చి 7 నుంచి తెలుగులో ఛావా.. గుడ్ న్యూస్ చెప్పిన గీతా ఆర్ట్స్

Highlights

బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తున్న ఛావా సినిమా తెలుగు రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 7 నుంచి ఛావా తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ తెలిపింది.

Chaava Movie: విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తున్న ఛావా సినిమా తెలుగు రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 7 నుంచి ఛావా తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ తెలిపింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితాధారంగా రూపొందించిన చిత్రమే ఛావా. శంభాజీ శివాజీ పాత్రలో విక్కీ కౌశల్, యేసుబాయి పాత్రలో రష్మిక, ఔరంగజేబుగా అక్షయ్ కన్నా నటించారు. ఫిబ్రవరి 14 విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. అద్భుతమైన కథనం, పెర్ఫార్మెన్స్‌తో ఛావా ప్రేక్షకుల హృదయాల్లో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సౌత్ ఇండియన్ సినిమా పవర్ హౌస్ అయిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఛావా తెలుగులో రిలీజ్ కానుంది. అయితే విక్కీ కౌశల్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని సమాచారం.

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగం కావడంపై విక్కీ సంతోషం వ్యక్తం చేశారు. పోరాట యోధుడి కథలో నటించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. విక్కీ శంభాజీ పాత్రలో నటించేటప్పుడు ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో విక్కీ చేతులను రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని.. ఆ సీన్ తర్వాత సుమారు నెలన్నరపాటు విక్కీ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. శంభాజీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నివేశం షూట్ చేసేటప్పుడు విక్కీ భావోద్వేగానికి గురైనట్టు చెప్పింది.

ఈ సినిమాలో శంభాజీ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ సైతం మూవీ టీమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం విడుదల రోజు నుంచే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను దాటిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. ఇక మార్చి 7న తెలుగులో విడుదల కాబోతున్న ఛావా ఇక్కడ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories