దేవాలో పూజా లిప్ లాక్.. షాకిచ్చిన సెన్సార్ బోర్డ్?

దేవాలో పూజా లిప్ లాక్.. షాకిచ్చిన సెన్సార్ బోర్డ్?
x

దేవాలో పూజా లిప్ లాక్.. షాకిచ్చిన సెన్సార్ బోర్డ్?

Highlights

పూజా హెగ్డే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. మహర్షి, రాధేశ్యామ్, అరవింద సమేత, అల వైకుంఠపురములో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు.

Pooja hegde: పూజా హెగ్డే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. మహర్షి, రాధేశ్యామ్, అరవింద సమేత, అల వైకుంఠపురములో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వరుస ప్లాపులతో కొంచె స్లో అయ్యారు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఇలా పూజా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొల్తా పడ్డాయి.

విజయ్, సూర్య వంటి హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక పూజా హెగ్డే బాలీవుడ్‌లో దేవా అనే సినిమాలో నటించారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. షాహిద్ కపూర్, పూజా మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలు సెన్సార్ బోర్డును సైతం షాక్ అయ్యేలా చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సినిమా దేవా. ఈ సినిమా జనవరి 31న విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇందులో లిప్ లాక్‌ సన్నివేశాలను కట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలతో పాటు విపరీతమైన రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో వాటికి సెన్సార్ కట్ చెప్పింది. ఈ సినిమాకు కొన్ని కట్స్ సూచించినప్పటికీ... ఆ తరువాత కూడా ఇంకొన్ని బోల్డ్ సీన్స్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్జిఫికెట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వరుస ప్లాపులతో ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న పూజాకు ఈ సినిమా అయినా సక్సెస్ ఇస్తుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories