మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

Case Registered Against Maitri Movie Makers | Tollywood News
x

మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

Highlights

*మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

Mythri Movie Makers: ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన మైత్రి మూవీ మేకర్స్ మరియు శ్రేయాస్ మీడియా గ్రూప్ ల పై పోలీసు కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే జూన్ 9వ తేదీన శిల్పకళావేదికలో నాని హీరోగా నటించిన "అంటే సుందరానికి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు.

దీంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి తరలివచ్చారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ మరియు షో హోస్ట్ చేసిన శ్రేయాస్ మీడియా వారు ఎక్కడా కూడా కరోనా నిబంధనలను పాటించలేదు.ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఈ విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర నుంచి నిర్వాహకులకు ఎలాంటి అనుమతి లభించలేదని పోలీసులు కూడా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు జరిగిన మరుసటి రోజున దరఖాస్తు కమిషనర్ టేబుల్ వద్దకు చేరిందని తెలుస్తోంది. ఇక ఇలాంటి ఈవెంట్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారులు పర్మిషన్ లెటర్ వంటివి చాలా జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories