Buchi Babu Sana: రెండవ సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బుచ్చిబాబు

* ఏదేమైనా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు మాత్రం రెండవ సినిమా కోసం చాలానే పాట్లు పడాల్సి వస్తోంది.

R Tripura Malini
Updated on: 23 Nov 2022 1:10 PM IST
buchibabu is unable to start his second film even after two years
X

రెండేళ్లయినా రెండవ సినిమాలు మొదలు పెట్టలేకపోతున్న బుచ్చి బాబు

Buchibabu Sana: సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో కారీర్ ను మొదలుపెట్టిన బుచ్చిబాబు సన 2021లో "ఉప్పెన" అనే సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చి బాబు రెండవ సినిమాని మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. "ఉప్పెన" సినిమా విడుదల అయ్యి దాదాపు రెండేళ్లు కావస్తోంది కానీ బుచ్చిబాబు మాత్రం ఇంకా తన రెండవ సినిమాని స్టార్ట్ చేయలేదు. గతంలో బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నారు అని వార్తలు వినిపించాయి.

"నాన్నకు ప్రేమతో" సినిమా సమయంలోనే ఎన్టీఆర్ కి బుచ్చిబాబు ఒక కథను వినిపించారని, ఇక ఎన్టీఆర్ కూడా ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని బుచ్చిబాబుకి చెప్పారని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చక ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు.

"భారతీయుడు 2" సినిమా పూర్తి చేసిన తర్వాత శంకర్ రామ్ చరణ్ సినిమా మీద పూర్తిగా ఫోకస్ చేయబోతున్నారు. ఈ సినిమా 2024లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగో గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని క్యాన్సిల్ చేయడంతో రామ్ చరణ్ శంకర్ తర్వాత బుచ్చిబాబు తోనే సినిమా చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మరొక రెండేళ్లు పట్టేలాగా కనిపిస్తోంది. ఈలోపు రామ్ చరణ్ మరే డైరెక్టర్ కైనా ఓకే చెప్తే ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు మాత్రం రెండవ సినిమా కోసం చాలానే పాట్లు పడాల్సి వస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story