నటనకి స్కోప్ ఉన్న పాత్రతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న బ్రహ్మానందం కొడుకు

Brahmanandam Son Raja Goutham is Going to Act in Another Experimental Movie
x

బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ (ఫైల్ ఫోటో)

Highlights

*మరొక ఎక్స్పరిమెంట్ సినిమాతో అలరించనున్న రాజా గౌతమ్

Raja Goutham: ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గత కొన్ని ఏళ్లుగా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటున్న సంగతి తెలిసిందే. "మను" అనే ఎక్స్పెరిమెంటల్ సినిమాలో నటించిన రాజా గౌతమ్ తాజాగా ఇప్పుడు మరో ఎక్స్పెరిమెంటల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజా గౌతం ఒక రైటర్ గా కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో రాజా గౌతమ్ పాత్రకి మోనోఫోబియా ఉండబోతుందట.

ఈ నేపథ్యంలో తనకి నటనకి బాగా ఆస్కారమున్న పాత్ర దొరికినందుకు రాజా గౌతమ్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీ రామ్ మద్దూరి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మోహన్ ఈ సినిమాకి ఛాయాగ్రహకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అతి తొందరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. మరి ఈ సినిమాతో రాజా ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచిచూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories