స్టార్‌ హీరోలకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్స్ .. నెట్టింట్లో వైరల్

స్టార్‌ హీరోలకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్స్ .. నెట్టింట్లో వైరల్
x
Highlights

రానా దగ్గుబాటి, స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్‌లకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్స్ ఇచ్చారు.

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి, స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్‌లకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్స్ ఇచ్చారు. 45 రోజులపాటు శ్రమించి శ్రీ వేంకటేశ్వర స్వామి స్కెచ్‌ను స్వయంగా గీసి.. దాన్ని ఫొటోఫ్రేమ్‌ చేయించి కొత్త సంవత్సరం కానుకగా హీరోలకు అందించారు. బ్రహ్మానందం పంపించిన కానుక పట్ల సంతోషం వ్యక్తం చేసిన బన్నీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్‌ చాలామందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బ్రహ్మానందం డ్రాయింగ్‌ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Show Full Article
Print Article
Next Story
More Stories