మరొకసారి షారుఖ్ ఖాన్ తో నటించనున్న బాలీవుడ్ స్టార్..

Bollywood Star will Act with Shah Rukh Khan Again
x

మరొకసారి షారుఖ్ ఖాన్ తో నటించనున్న బాలీవుడ్ స్టార్..

Highlights

Shah Rukh Khan: మరొకసారి షారుఖ్ ఖాన్ తో నటించనున్న బాలీవుడ్ స్టార్..

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ మధ్యనే "పటాన్" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో "జవాన్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ ను సంప్రదించారట. కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా అడిగారట.

కానీ బన్నీ కూడా తిరస్కరించేసరికి చిత్ర బృందం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ను సంప్రదించారు. సంజయ్ దత్ ఈ సినిమాని ఒప్పుకున్నారు. చాలాకాలం తర్వాత షారుక్ ఖాన్ మరియు సంజయ్ దత్ లను ఒకేసారి వెండి తెర పై చూడడానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా సంజయ్ దత్ మరియు షారుక్ ఖాన్ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు ఓం శాంతి ఓం, రావణ్ వంటి సినిమాల లో కలిసి నటించిన ఈ ఇద్దరు హీరోలు తమ నటనతో ఇంప్రెస్ చేశారు.

త్వరలోనే సంజయ్ దత్ తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలుపెట్టబోతున్నారట. మరోవైపు విజయ్ హీరోగా నటిస్తున్న "లియో" సినిమాలో కూడా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సంజయ్ దత్ షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం చిత్ర బృందం భారీ బడ్జెట్ తో షూటింగ్ సెట్ల ను నిర్మించినట్లు తెలుస్తోంది. నయనతార మరియు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories