బన్నీ పాటకు బాలీవుడ్ భామల డ్యాన్స్ చూసారా!

బన్నీ పాటకు బాలీవుడ్ భామల డ్యాన్స్ చూసారా!
x
Highlights

మాటల మాంత్రికుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'.

మాటల మాంత్రికుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా కంటే ముందు పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులోని 'బుట్ట బొమ్మ' పాట అందరిని ఆకట్టుకుంది. ఈ పాటకి ప్రేక్షకుల మాత్రమే కాదు. సెలబ్రేటిలు కూడా ఫిదా అయ్యారు.

బాలీవుడ్ సిస్టర్స్ అయిన శిల్పా శెట్టి , షమితా శెట్టి ఈ పాటపై టిక్ టాక్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇందులో శిల్పా శెట్టి చక్కగా చీరకట్టుకుని డ్యాన్స్ చేస్తే, షమిత మాత్రం షార్ట్స్ వేసుకుని డ్యాన్స్ చేసింది. ఇక ఈ వీడియో తెలుగు ఆడియన్స్ ని రీచ్ అవ్వడంతో సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక శిల్పా శెట్టి తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ సినిమాలలో నటించి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఇక సంక్రాంతికి వచ్చి విజయాన్ని అందుకున్న 'అల వైకుంఠపురములో' సినిమాకి సీక్వెల్ తీసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇది బన్నికి 20 వ సినిమా.. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories