విమర్శలపై స్పందించిన బాలీవుడ్ గాయనీ

విమర్శలపై స్పందించిన బాలీవుడ్ గాయనీ
x
Kanika Kapoor (File Photo)
Highlights

ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తరప్రదేశ్‌ వచ్చిన కనికా కపూర్‌ ఓ హోటల్‌లో బస చేసింది.

ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తరప్రదేశ్‌ వచ్చిన కనికా కపూర్‌ ఓ హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్‌లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్సను అందించారు. చికిత్సలో భాగంగా ఆమెకి అయిదు సార్లు టెస్టు చేయగా అన్ని సార్లు పాజిటివ్ అనే తేలింది. ఇక దీనితో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇక ఆరోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటీవ్ వచ్చింది. కనికా దైర్యం కోల్పోకుండా వైద్య సిబ్బందికి సహకరించిం కరోనా పై విజయం సాధించింది.

అయితే బాధ్యత‌రాహిత్యంగా ప్రవ‌ర్తించిన క‌నికాని కఠినంగా శిక్షించాలని పలువురు అమెను విమర్శించారు. అంతేకాదు ఆమెపై లేని పోని ఆరోప‌ణ‌లు చేశారు. అయితే వీటిపైన కనికా తాజాగా స్పందించింది. నా గురించి అనేక కథల కథనాలు ఉన్నాయని నాకు తెలుసు. నేను సైలెంట్‌గా ఉండ‌డం వ‌ల‌న మరింత ఆజ్యం పోసినట్లు అనిపిస్తుంది. నిజం నిల‌క‌డ‌గా తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. మార్చి 10న నేను లండ‌న్ నుండి ముంబైకి ప్రయాణించాను. ఆ రోజు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్స్‌లో స్క్రీనింగ్ జ‌రిపారు. నాకు అనారోగ్య స‌మ‌స్యలు కూడా ఏవి క‌నిపించ‌క‌పోవ‌డంతో క్వారంటైన్‌లో ఉండాల‌ని అనుకోలేదు. ఈ క్రమంలో మార్చి 11న ల‌క్నోలో నా ఫ్యామిలీని క‌ల‌వ‌‌డానికి వెళ్లాన‌ని క‌నికా చెప్పుకొచ్చింది. ఇక మార్చి 14 మరియు 15 తేదీలలో, తాను స్నేహితుడి భోజనానికి మరియు విందుకు హాజరయ్యానని అప్పుడు నేను సంపూర్ణ సాధారణ ఆరోగ్యంతో ఉన్నానని కనికా చెప్పుకొచ్చింది.

ఇక మార్చి 17,18 తేదీల‌లో క‌రోనా ల‌క్షణాలు కాస్త క‌నిపించ‌డంతో మార్చి 19న టెస్ట్ చేయించుకున్నాను. మార్చి 20న క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారని వెల్లడించింది. ఆ తర్వాత వెంట‌నే ఆసుప‌త్రిలో చేరానని , 21 రోజుల ఐసోలేష‌న్ త‌ర్వాత డిశ్చార్జ్ అయ్యాననీ వెల్లడించింది. కరోనా సోకినా సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్న వైద్యులు మరియు నర్సులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ ఈ విషయాన్ని నిజాయితీ మరియు సున్నితత్వంతో పరిష్కరించగలరని నేను నమ్ముతున్నానని ఆమె తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories