Bollywood: కరోనా బారిన పడిన రణబీర్ కపూర్

Bollywood: హీరో రణబీర్ కపూర్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని అతని తల్లి నీతూ కపూర్ వెల్లడించారు.

Kranthi
Published on: 9 March 2021 3:55 PM IST
Bollywood Ranbir Kapoor Hero Tests Positive for Covid 19
X

ఫైల్ ఇమేజ్


Bollywood: దేశంలోమరోసారి కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య అంతకంతకూ పురుగుతోంది. తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా సోకింది. రణబీర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని అతని తల్లి నీతూ కపూర్ వెల్లడించారు. తన కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని, క్రమంగా కోలుకుంటున్నాడని వివరించారు. 'రణబీర్ ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతున్న అందరికీ కృతజ్ఞతలు' అంటూ నీతూ సోషల్ మీడియాలో స్పందించారు.

ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ ప్రేమ‌, ఆప్యాయ‌త‌కు ధ‌న్య‌వాదాలు అంటూ నీతూ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, ర‌ణ్‌బీర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో అలియా భ‌ట్, నాగార్జున ముఖ్య పాత్ర‌లు చేస్తున్న విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story