రామ్ చరణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ నిర్మాత

Bollywood Producer Planning a Multi Starrer Movie with Ram Charan
x

రామ్ చరణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ నిర్మాత 

Highlights

*రామ్ చరణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ నిర్మాత

Ram Charan: "అర్ఆర్ఆర్" సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్లో ఒక సినిమా హిట్టయితే అందులో ఉన్న హీరో ని బాలీవుడ్ లో లాంచ్ చేసే దర్శక నిర్మాతలు చాలామంది ఉన్నారు.

ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరిగింది. స్టార్ డైరెక్టర్ నడుపుతున్న ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రామ్ చరణ్ తో ఒక హిందీ సినిమాను ప్లాన్ చేస్తోంది. చెర్రీ నో చెప్పలేనటువంటి భారీ రెమ్యునరేషన్ ని ఆశ చూపించి రామ్ చరణ్ ని ఎలాగైనా బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేయాలని ఆ నిర్మాణ సంస్థ ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ ఇంకా ఓకే చెప్పలేదు కానీ ఆ నిర్మాణ సంస్థ మాత్రం రామ్ చరణ్ తో బాలీవుడ్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తోందట. మరి రామ్ చరణ్ ఈ మల్టీస్టారర్ సినిమాకి ఓకే చెప్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories