ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Bollywood Heroin Says she wants to Act with Jr NTR | Telugu Movie New
x

ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Highlights

ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Jr NTR Film: ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో మరొక సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేశారు ఎన్టీఆర్. వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టిఆర్ తో రొమాన్స్ చేయడానికి ఒక బాలీవుడ్ బ్యూటీ ఆసక్తిగా ఎదురు చూస్తోందట. ఆమె మరెవరో కాదు దీపికా పడుకొనే. టాలీవుడ్ లో ఏ హీరో తో నటించాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో అడగగా దీపికా పడుకొనే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పింది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ప్రాజెక్ట్ కె" సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ పరిచయం కాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాలో కూడా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాల కోసం కూడా బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories