logo
సినిమా

Salman Khan: చిరంజీవి వెంకటేష్ లతో సినిమాలు చేస్తాను అంటున్న సల్మాన్ ఖాన్

Bollywood Hero Salman Khan Says i will Act With Chiranjeevi And Venkatesh
X

సల్మాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

Highlights

* నా సినిమాలు అన్నీ తెలుగులో విడుదల చేస్తాను అంటున్న సల్మాన్ ఖాన్

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు "అంతిమ్: ది ఫైనల్ ట్రూత్" అనే ఒక హిందీ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ చెల్లెలి భర్త ఆయుష్ శర్మ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని చాలా భాషల్లో విడుదల చేద్దామనుకున్నట్లుగా తెలిపారు. "కానీ కోవిడ్ పరిస్థితుల వల్ల అది కుదరలేదు. ఏదేమైనా తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంది అందుకే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాము" అని అన్నారు సల్లు భాయ్.

"ఆయుష్ శర్మ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా తర్వాత సినిమాలని కూడా ఖచ్చితంగా తెలుగులో రిలీజ్ చేస్తాను. ప్రస్తుతం హిందీలో భాయిజాన్, దబాంగ్ 4, టైగర్ 3, సినిమాలు చేస్తున్నాను తెలుగు లో చిరంజీవి తో "గాడ్ ఫాదర్" సినిమాలో కూడా నటిస్తున్నాను. ఇప్పటిదాకా నా పాత్ర ఏంటి అని నేను అడగలేదు. నా సినిమాలో చేయాలని చిరు అడిగారు. ఎన్ని రోజులు కాల్షీట్లు కావాలి అని మాత్రమే అడిగాను. వెంకటేష్ కూడా ఒక సినిమాలో నటించబోతున్నాను. త్వరలో ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను" అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్.

Web TitleBollywood Hero Salman Khan Says i will Act With Chiranjeevi And Venkatesh
Next Story