సౌత్‌ సినిమాల సక్సెస్‌లతో బాలీవుడ్‌ బేజారు

Bollywood Effect Fell With the Success of South Movies
x

సౌత్‌ సినిమాల సక్సెస్‌లతో బాలీవుడ్‌ బేజారు

Highlights

Bollywood: దబాంగ్‌, దంగల్‌ లాంటి హిట్ల కోసం కసరత్తులు

Bollywood: ఈ మధ్య కాలంలో సౌత్‌ సినిమాలు గ్రాండ్ సక్సెస్‌ సాధిస్తున్నాయి. యూనివర్సల్‌ కంటెంట్‌తో హాలీవుడ్‌ స్టాండర్డ్స్ మూవీలను తీసుకురావడంతో ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ సౌత్‌ సినిమాలపై మరింత పెరిగింది. ఇదిలా ఉంటే సౌత్‌ హిట్స్‌ పై బీటౌన్‌ స్టార్‌ హీరోల్లో నైరాశ్యం ఎక్కువైంది. దీంతో బాలీవుడ్ బాయ్స్‌ తమ వర్క్‌పై రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సేఫ్‌ జోన్‌లో సినిమాలు చేసేందుకు సిద్దమవడంతో పాటు రీమేక్‌లపై దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలను తీయాలంటే ఏ వుడ్ అయినా కొరియన్ సినిమాలను ఫ్రీమేక్ చేసేవారు. రీమేక్‌ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ల వైపు చూసేవారు. అనంతరం తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోని సినిమాలతో సల్మాన్, అక్షయ్ లాంటి స్టార్స్ సేఫ్ గేమ్ ఆడటం మొదలు పెట్టారు. ఇప్పటికే హిట్టయిన సినిమా అయితే మార్పులు చేసుకొని గ్యారెంటీగా హిట్‌ కొట్టొచ్చనే కాన్సెప్ట్‌తో కష్టపడటం తగ్గించారు. దీంతో బాలీవుడ్‌ ఆడియన్స్‌కు చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా అమీర్‌ఖాన్‌ నటిస్తున్న "లాల్‌ సింగ్‌ చద్దా" హాలీవుడ్‌ మూవీ "ఫారెస్ట్ గంప్‌" ఆధారంగా తెరకెక్కించారు. హాలీవుడ్‌లో 1994లో విడుదలై కమర్షియల్ విజయాన్ని సాధించి, ఆస్కార్ లను గెలుపొందింది ఈ చిత్రం. ఇప్పటికే ఆ సినిమాను చాలాసార్లు చూసినవారున్నారు‌. ఈ క్రమంలో ఆగస్టు 11న ఈ మూవీ విడుదల కానుంది. అయితే సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమోషన్‌ చాలా అవసరం. దీంతో మూవీపై బజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలీక అమీర్‌ఖాన్‌ తికమక పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మేకింగ్‌లో ఉన్న బ్లర్, బ్లయిండ్‌, రాంబో రీమేక్‌ల భవితవ్యం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. మరోవైపు రిలీజ్‌కు రెడీగా ఉన్న జెర్సీ రకరకాల కారణాలతో వెనక్కి తగ్గడం, బచ్చన్‌ పాండే ప్లాప్‌ అవ్వటం కూడా బాలీవుడ్‌ మేకర్స్‌లో భయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి బాలీవుడ్‌కు పూర్వవైభవం రావాలంటే మరోసారి దబాంగ్‌, దంగల్‌ వంటి ఒరిజినల్‌ హిట్స్‌ రావాల్సిన అవసరముంది. దీంతో తమ అభిరుచిని పక్కనబెట్టి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories