విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు
x
Irrfan Khan (File Photo)
Highlights

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కన్నుమూశారు.

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇర్ఫాన్ ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో తుదశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నారు. చివరి సారిగా అయన "ఆంగ్రేజీ మీడియం'' చిత్రంలో నటించారు. ఈ నెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మృతి చెందిన విషయం తెలిసిందే.

నాలుగు రోజులకే ఇర్ఫాన్‌ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబచ్చన్ ఇర్ఫాన్ ఖాన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇర్ఫాన్ మృతి వార్త కలసి వేసిందని , సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని అన్నారు.

శేఖర్ కపూర్ కూడా ఇర్ఫాన్ మృతి పై అందించారు. ప్రతి ఒక్క నటుడు దర్శకుడు ఇర్ఫాన్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటారని అన్నారు. ఇర్ఫాన్ ఖాన్ ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని, భారత సినీ పరిశ్రమలో ఇర్ఫాన్ ఒక మంచి నటుడని పేర్కొన్నారు. అటువంటి ఇర్ఫాన్ తనువుచాలించడంటే నమ్మలేకపోతున్నా మని పేర్కొన్నారు. హీరోయిన్ తాప్సీ, నటుడు కరణ్ జోహార్ కూడా ఇర్ఫాన్ మృతి పై సంతాపం వ్యక్తం చేశారు. మీ ఎన్నో సినిమాలు చెరగని జ్ఞాపకాలున్నాయని కరణ్ జోహార్ అన్నారు.








Show Full Article
Print Article
Next Story
More Stories