పవన్ కళ్యాణ్ సినిమా లో బాలీవుడ్ నటి

Bollywood Actress in Pawan Kalyan Movie
x

పవన్ కళ్యాణ్ సినిమా లో బాలీవుడ్ నటి

Highlights

*హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేయనున్న బాలీవుడ్ నటి

Pawan Kalyan: "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" వంటి హిట్ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్ లో మొదలైన ఈ సినిమా 2022 లో విడుదల కావాల్సి ఉంది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. రాజకీయ పనుల్లో కూడా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో కీలకపాత్రలో పోషిస్తున్న కొందరు నటీనటులు కూడా ఈ షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఈ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతోందట. ఇక ఈమె ఈ నెల ఆఖరి నుంచి సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది.

సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ఈ షెడ్యూల్లో జరగబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories