Cruise Drugs Case: జైలుకి వెళ్లి కొడుకును కలిసిన షారుక్ ఖాన్

Bollywood Actor Shahrukh Khan has meet his Son Aryan Khan in Arthur Road jail in Mumbai
x

జైలుకి వెళ్లి కొడుకు ఆర్యన్ ఖాన్‌ను కలిసిన షారుక్ ఖాన్(ఫైల్ ఫోటో)

Highlights

*డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ *ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో నిందితుడు

Cruise Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టయి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ ను కలిశాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్. తనయుడితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. ఈ నెల 2న ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారుక్ అతన్ని కలవడం ఇదే తొలిసారి. గత వారం షారుక్ తో పాలు అతని భార్య గౌరీ ఖాన్ జైల్లో ఉన్న ఆర్యన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యేక కోర్టు రెండు సార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో కుమారుడిని చూసేందుకు షారుక్ ఖాన్ జైలుకు వచ్చారు. మరోవైపు కేసు విచారణలో భాగంగా షారుక్ మేనేజర్, న్యాయవాదులు ఆర్యన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టు పలుమార్లు బెయిల్ నిరాకరించడంతో ఆర్యన్ బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories