Dilip Kumar: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత

Bollywood Actor Dilip Kumar Passes Away
x

నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత (ఫైల్ ఇమేజ్)

Highlights

Dilip Kumar: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన దిలీప్ * హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరొందిన దిలీప్ కుమార్ ఇక లేరు. భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్‌ను పరిచయం చేసిన యాక్టర్ ఆయన.. గత కొంత కాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7.30 కన్నుమూసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దిలీప్ కుమార్ మరణవార్తతో బీ టౌన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగ్గజ నటుడి మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు. ఆయన పూర్తి పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి వచ్చాక... ఆయన పేరును దిలీప్ కుమార్‌గా బాంబే టాకీస్ యజమాని పేరు మార్చారు. అప్పటి నుంచి ఆయన పేరు దిలీప్ కుమార్‌గా ఫేమస్ అయ్యారు. ఈ దిగ్గజ నటుడు 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్‌ను నాలుగు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను ఏలాడు. ఆ సమయంలో ఎంత మంది యంగ్ హీరోలు వచ్చినా.. తన సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఆ క్రేజ్ లెక్కలే వేరుగా ఉండేవి. 1944లో జ్వర్ భాతా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పదేళ్ల పాటు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు.. 1955లో వచ్చిన దేవదాస్ సినిమా దిలీప్ ఫిల్మ్‌ కెరీర్‌ను మార్చేసింది. ఈ సినిమా రికార్డులను సృష్టించింది. దేవదాస్ సినిమాతో దిలీప్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు..

1955లో వచ్చిన ఆజాద్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా రికార్డుల సునామి సృష్టించింది. ఆజాద్ మూవీ దశాబ్దిలో అధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత పౌరాణిక చిత్రం మొఘల్-ఎ-ఆజామ్‌తో దిలీప్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కోహినూర్ అందాజ్, ఆన్, డాగ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్ చిత్రాలతో దిలీప్ కుమార్ ప్రేక్షకధారణ పొందారు. దిలీప్ కెరీర్‌లో చివరి సినిమాగా 1998లో వచ్చిన ఖిల్లా మిగిలింది.

దిలీప్ కుమార్ చేసిన యాక్టింగ్‌కు ఎన్నో అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా 8సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. 2015లో దిలీప్ కుమార్‌ను పద్మభూషన్ వరించింది. అంతకుముందు 1991లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్‌తో సత్కరించింది. 1993లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ పురస్కారం లభించింది. 1998లో దిలీప్‌ను పాక్ ప్రభుత్వం నిషాన్- ఇ- ఇంతియాజ్ అవార్డుతో సత్కరించింది. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్ కుమార్ సేవలు అందించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయాలను చూస్తే... 1966లో నటి సైరాభానును మొదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1980లో అస్మాను రెండో వివాహం చేసుకున్నారు. స్నేహితుడు రాజ్‌కుపూర్‌తో కలిసి 65 సినిమాల్లో దిలీప్ కుమార్ నటించారు..


Show Full Article
Print Article
Next Story
More Stories