Top
logo

Samantha Akkineni: బోల్డ్‌ పాత్రలో సమంతా అక్కినేని?

Boldest Role for Samantha in her Career
X

సమంతా (ఫొటో ట్విట్టర్)

Highlights

Samantha Akkineni: సమంతా అక్కినేని ఈ మధ్య బోల్డ్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.

Samantha Akkineni: సమంతా అక్కినేని ఈ మధ్య బోల్డ్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. 'మజిలీ', 'ఓ బేబీ' వంటి సినిమాల్లో నటించిన సమంతా.. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి సందడి చేసేందుకు రెడీ గా ఉంది.

ఈ సిరీస్‌లో ఎల్‌టీటీఈ ఉగ్రవాది పాత్రలో సమంతా నటించబోతోందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు రాజ్, డీకే హెల్మ్ నిర్మించారు. ఈ సందర్భంగా ఈనెల చివరి వారంలో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు నిర్మాతలు సమంతా పాత్ర గురించి విస్మయానికి గురి చేసే న్యూస్ వెల్లడించారు. ఈ సిరీస్‌లో సామ్ తన సినిమా కెరీర్‌ లో పోషించని పాత్రలో నటిస్తుందని, బోల్డ్ పాత్రలో అద్బుతంగా నటించిందని పేర్కొన్నారు. ఈ పాత్ర తన కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌లా మారుతుందని వారు నమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే ఈ పాత్రలో విలన్ షేడ్స్ కూడా అద్భుతంగా చూపించిందని కొనియాడారు.

అయితే, ముందుగా ఈ పాత్ర పోషించేందుకు సమంతాను అడిగేందుకు భయపడ్డారంట. ఇలాంటి పాత్రలో పోషించదేమోనని కొంత అనుమానంతోనే అక్కినేని కోడలు వద్దకు వెళ్లారంట. కానీ, తన రెస్పాన్స్ చూసి నిర్మాతలు ఆశ్చర్యపోయారంట. నటించేందుకు ఒప్పుకుని, అద్బుతంగా నటించిందని వారు పేర్కొన్నారు.

సమంతాతో పాటు మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి సిరీస్ చాలా అద్భుతంగా రెస్పాన్స్ రావడంతో.. రెండో సిరీస్‌పై అంచనాలు భారీగానే పెరిగాయి. జూన్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Web TitleBoldest Role for Samantha in her Career
Next Story