HBD Sai Pallavi: మలార్ బ్యూటీకి శ్యామ్ సింగ‌రాయ్ బర్త్ డే ట్రీట్..

HBD Saipallavi
x

సాయి పల్లవి

Highlights

HBD Sai Pallavi: సాయి పల్లవి మలయాళీ కుట్టి. ప్రేమమ్ మూవీతో సిల్వ‌ర్ స్రీన్ కు పరిచయమైన పుత్త‌డి బొమ్మ.

HDB Sai Pallavi: నవ్వుల లేవుర ముత్యాల్…అది నవ్వితే వస్తాయ్ మురిపాల్..దాని సెంపలు ఎన్నెల కురియా..దాని సెవులకు దుద్దులు మెరియా..అది రమ్మంటె రాదురా సెలియా..దాని పేరే సారంగ దరియా..ఈ పదాలు సాయిప‌ల్ల‌వికి అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతాయేమో. సాయిప‌ల్ల‌వి వెన్నెల వంటి మోము, న‌వ్వితే చాలు మల్లె పూవు తెల్లబోతుంది. సాయిప‌ల్ల‌విని చూస్తే సినీ అభిమానులు ఫిదా కావాల్సిందే. ఈ పాట మంగ్లీ పాడినా.. హీరోయిన్ సాయిప‌ల్ల‌వి డాన్స్ ప్ర‌త్యేకం అనే చెప్పాలి. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి, తన స్టెప్పులతో చూపు తిప్పుకోకుండా చేయగలదు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సాయి పల్లవి గురించి ఆస‌క్తికర విష‌యాలు తెలుసుకుందాం.

సాయి పల్లవి మలయాళీ కుట్టి. ప్రేమమ్ మూవీతో సిల్వ‌ర్ స్రీన్ కు పరిచయమైన పుత్త‌డి బొమ్మ. ఫిదా సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన తెలంగాణ పిల్ల. త‌న‌ భాష, యాసతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ రౌడీ బేబీ. శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలో సాయిప‌ల్ల‌వి న‌ట‌నకు తెలుగు ప్రేక్షకులను ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ సినిమాలోనూ సాయిప‌ల్ల‌వి తన ముద్ర వేయగలిగింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి, తన స్టెప్పులతో చూపు తిప్పుకోకుండా చేయగలదు. ఊర మాస్ స్టెప్పులతో ప్రేక్షకులతో విజిల్స్ వేయించగలదు.

ఢ్యాన్స్ పై ఉన్న ప్రేమ‌తో తెలుగులో ఈటీవిలో ఢి షోలో 2009 ఫైనల్ లో ప్ర‌వేశించిది. అప్పుడు ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని చూసి అంతా అశ్చ‌ర్య‌పోయారు. సినిమాల్లో వ‌స్తుంద‌ని హీరోయిన్ గా చేస్తుంద‌ని ఎవ‌రు ఊహించి ఉండ‌రూ.. సాయి పల్లవి మెడిసిన్ కూడా పూర్తి చేసింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సాయిప‌ల్ల‌వి ఆమె సినిమాల్లోకి రాకపోయి ఉంటే మంచి నటిని మిస్ అయ్యే వాళ్లం అని చెప్తుంటారు ఫ్యాన్స్. సాయి పల్లవి ఇండస్ట్రీకి దొరకడం గొప్ప బహుమతి అంటుంటారు. ఇండస్ట్రీ లో ప్రస్తుతమున్న హీరోయిన్లలో బెస్ట్ ఆప్షన్ అనిపించుకుంటుంది. ఒక సీన్ షూటింగ్ ఉందని చెప్తే… సెట్ కి వచ్చామా.. మనపని మనం చూసుకున్నామా.. వెళ్లామా అని కాకుండా అసలు ఆ సీన్ ఎందుకు ఇలాగే చేస్తున్నారు.. మరోలా ఎందుకు చేయకూడదు అని డైరెక్టర్ దగ్గర అన్ని వివరాలు తెలుసుకుని మరీ అందుకు తగినట్లుగా తనను తాను మౌల్డ్ చేసుకుంటుంది

ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల్లో న‌టించింది. క‌రోనా కార‌ణంగా ఆ సినిమాల విడుద‌ల ఆల‌స్యం అవుతుంది. విరాట పర్వం నుంచి విడుదలైన మలార్ బ్యూటీ క్యారెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలంగాణ బతుకు పోరాటం నేపథ్యంలో సాగే కథ సినిమా ఇది. శ్యామ్ సింగ‌రాయ్ చిత్ర‌లో సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. చిత్ర ద‌ర్శ‌కుడు. ఈ పోస్ట‌ర్ లో సాయిప‌ల్లి త్రిశూలం చేతిలో ప‌ట్టుకుని ఉంది. సాయిప‌ల్ల‌వి త‌న కెరీర్ లో మూనుపెన్న‌డూ పోషిచించ‌ని పాత్ర ఈ సినిమాలో చేస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories