కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ఇండియన్ సినిమా.. ఈ ఏడాది వెండితెరపై టాప్ సినిమాలు

కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ఇండియన్ సినిమా.. ఈ ఏడాది వెండితెరపై టాప్ సినిమాలు
x
Highlights

సౌత్ సినీ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అనే కాదు మొత్తం సినీ పరిశ్రమ బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జీవితం వృతాంతం నేపథ్యంలో 1991 తెలుగు సినిమా అశ్వని పేరుతో సినిమా తీశారు.

సౌత్ సినీ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అనే కాదు మొత్తం సినీ పరిశ్రమ బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జీవితం వృతాంతం నేపథ్యంలో 1991 తెలుగు సినిమా అశ్వని పేరుతో సినిమా తీశారు. ఈ సినిమాను రామోజీరావు నిర్మాతగా చేశారు. ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫొగాట్ అతని జీవిత కథ ఆధారంగా "దంగల్‌" చిత్రాన్ని తెరకెక్కిన సంగతి తెలిసిందే. మహావీర్ సింగ్ ఫొగాట్ అతని కుమార్తెలు గీతా ఫొగట్, బబితా ఫోగట్ లను దేశం గర్వించదగ్గ మహిళా రెజ్లర్లుగా తీర్చిదిద్దిన నేపథ్యమే ఈ చిత్రం.

అలాగే సచిన్‌ తెందూల్కర్‌ జీవిత కథ ఆధారంగా "సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్", భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని క్రికెట్ కెరీర్ , వ్యక్తిగత జీవితం బేస్ చేసుకుని వచ్చిన "ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ" చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ జీవితం ఆమె క్రీడా నేపథ్యంతో రూపొందిన సినిమా 'మేరి కోమ్'. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసింది. మేరికోమ్ అనే యువతి ఈశాన్య భారతదేశంలోని గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన బాక్సింగ్ క్రీడలో వచ్చి, అంతర్జాతీయ ఛాంపియన్ గా మేరి కోమ్ ఎలా మారింది. అనే కథాంశంతో తెరకెక్కింది.

బాలీవుడ్‌, నుంచి టాలీవుడ్ వరకు బయోపిక్‌ల సంఖ్య చాంతాడంత ఉంటుంది. ఈ సారి మాత్రం సినీ ఇండస్ట్రీ రూట్ మార్చింది. అడపాదడపా క్రీడాకారుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీస్తువస్తున్నారు. కాగా..ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని బయోపిక్‌ల చుద్దాం..

బయోపిక్ విషయంలో టాలీవుడ్ ముందే ఉంటుంది. పిటీఉషా ,అశ్వని నాచప్ప జీవిత కథల ఆధారంగా సినిమాలు వచ్చాయి. మరోసారి క్రీడా నేపథ్యమున్న సినిమా రాబోతోంది. గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా నటించున్నారు. ఈ సినిమాకు 'సీటీమార్‌' అనే టైటిల్‌ని నిర్ణయించారు. సంప‌త్‌నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


తెలుగు క్రీడాకారిని 'పి.వి.సింధు' బయోపిక్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్‌ స్టార్లు కనిపించనున్నారు. సింధు పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుండగా కోచ్ గోపీచంద్‌గా అక్షయ్‌కుమార్‌ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.


సయ్యద్‌ అబ్దుల్‌ రహీం ఫుట్‌బాల్‌ ఆటలో దేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా వస్తున్న చిత్రం 'మైదాన్‌'. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా కనిపించనున్నాడు. అమిత్‌ రవీంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ 'ఝుండ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మురికివాడల్లో డ్రగ్స్‌కు అలవాటు పడి ఆవారాగా తిరిగే యువకులను మార్చి ఒక ఫుట్‌బాల్‌ కోచ్ గా అమితాబ్ నటిస్తున్నారు.


1983 భారత క్రికెట్‌ చరిత్రలో మరిచిపోలేని ఏడాది. క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్‌ కపిల్‌దేవ్‌ నేతృత్వం టీమిండియాను జగజ్జేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం '83'. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ నటించనున్నారు. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రపంచం గర్విచదగ్గ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా 'శభాష్‌ మిథూ' తెరకెక్కుతోంది. ఇందులో మిథాలీగా తాప్సీ కనిపించనుంది. భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పరిణీతి చోప్రా.. సైనా పాత్రలో కనిపించనుంది.

షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన అందించిన మొట్టమొదటి షూటర్‌ అభినవ్‌ బింద్రా. ఆ‍యన జీవిత కథ ఓ ఆధారంగా సినిమా రాబోతోంది. ఈ ఏడాది ఈసినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అనిల్‌ కపూర్‌ తనయుడు హర్షవర్దన్‌ కపూర్‌ కీలక భూమిక పోషిస్తు్న్నారు. కన్నన్‌ అయ్యర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories