Acharya : ఆచార్య విడుదల ముందే రికార్డ్.. కొరటాల ప్లాన్ అదుర్స్

Acharya : ఆచార్య విడుదల ముందే రికార్డ్.. కొరటాల ప్లాన్ అదుర్స్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'పై భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ అభిమానుల్లో ఉత్సాహన్ని నింపుతున్నాయి. ఇక కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఓ‌ భారీ సెట్ వేశారు. టెంపుల్‌ టౌన్‌గా వేసిన ఇంత పెద్ద సెట్ ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ వేయలేదని, ఇది ఇండియా లోనే ది గ్రేట్ సెట్ అని అంటున్నారు. దాదాపు 20 ఎకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

కాగా.. ఇన్ని ఎకరాల్లో టెంపుల్‌ టౌన్ సెట్ వేయడం మన దేశంలో ఇదే తొలిసారి కావడంతో ఆ రికార్డు 'ఆచార్య' ఖాతాలో పడింది. జనవరి 10వ తేదీతో చిరంజీవితో చేస్తున్న సోలో సన్నివేశాల చిత్రీకరణ పూర్తికానుంది ప్రస్తుతం రామ్ చరణ్ కరోనా వైరస్ బారినపడి క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఆయన సెట్స్ పైకి వస్తారట. ఆ వెంటనే కాజల్, రామ్ చరణ్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేయాలనేది కొరటాల ప్లాన్. దాదాపు 30 రోజుల పాటు చెర్రీ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories