BIGGBOSS 3: ఆ ఇద్దరి మధ్య... కొద్దిపాటి తేడా !

sreemukhi,alireza,rahul,baba bhaskar,varun sandesh
x
sreemukhi,alireza,rahul,baba bhaskar,varun sandesh
Highlights

బిగ్ బాస్ విజేత ఎవరు అన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది. పదిహేడు మందితో మొదలైన ఈ షో 104 రోజులు పూర్తి చేసుకుంది. నేటితో ఈ షోకి శుభం కార్డు పడనుంది....

బిగ్ బాస్ విజేత ఎవరు అన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది. పదిహేడు మందితో మొదలైన ఈ షో 104 రోజులు పూర్తి చేసుకుంది. నేటితో ఈ షోకి శుభం కార్డు పడనుంది. ఎంతో ఉత్కంట బరితంగా సాగుతున్న ఈ షోలో టైటిల్ కోసం మొత్తం అయిదుగురు సభ్యులు పోటిపడుతున్నారు. ఇందులో వరుణ్ సందేశ్ , అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్ , రాహుల్ సిప్లీగంజ్ ఉన్నారు. పోటిలో అయిదుగురు ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం రాహుల్ వర్సెస్ శ్రీముఖి అన్నట్టుగానే సాగుతుంది.

అయితే తాజా సర్వేల ఆధారంగా చూస్తే రాహుల్ శ్రీముఖిపై విజయం సాధించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కేవలం ఒక్క శాతం ఓట్లతోనే రాహుల్ విజయం సాధించినట్టు లీకులు అందుతున్నాయి. ప్రధానంగా ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగిందని కానీ చివరిలో రాహుల్ విజేతగా నిలిచినట్టుగా తెలుస్తుంది. దీనితో శ్రీముఖి రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని లీకులు తెలుపుతున్నాయి.

ముందునుండి శ్రీముఖి టైటిల్ ఫేవరేట్ గానే బరిలో ఉంది. అభిమానులు కూడా శ్రీముఖిని విజేతగా చేసేందుకు చాలానే కష్టపడ్డారు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా షోకి వచ్చి చివరి వారంలో పుంజుకొని రాహుల్ విజయం సాధించాడని సమాచారం.. పదకొండు వారాలు వరుస నామినేషన్స్‌తో పడుతూ లేస్తూ వస్తున్న రాహుల్‌కే జనం జై కొట్టారని లీకులు చెబుతున్నాయి. అయితే ఈ ఉత్కంటకి మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

గమనిక : ఇది కేవలం వస్తున్న లీకుల ఆధారంగా రాసింది మాత్రమే.. విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు స్టార్ మాలో షోని చూడండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories