మోనాల్ రుణం తీర్చుకున్న హారిక!

మోనాల్ రుణం తీర్చుకున్న హారిక!
x
Highlights

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో మరింత కనెక్ట్‌ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ అవకాశం కల్పిస్తున్నాడు. చిన్నచిన్న టాస్క్‌లు ఇస్తూ గెలిచిన వారికి ఓట్లు అభ్యర్థించే అవకాశం కల్పిస్తున్నాడు.

ఇంటిసభ్యులను "ఓం నమస్తే బోలో బేబీ" సాంగ్‌తో నిద్రలేపారు బిగ్‌బాస్‌. ఈ పాటకు అరియానా హౌస్‌లో కాలు కదపగా.. అఖిల్‌, సోహైల్‌, హారిక గార్డెన్‌ ఏరియాలో డ్యాన్స్‌ చేశారు. ఇక చాన్స్‌ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేస్తున్నాడు అఖిల్‌. మోనాల్‌ ముందే హారికను ఫ్లర్ట్‌ చేశాడు. హారిక మాటలకు అఖిల్‌ మరింత రెచ్చిపోయి ఆమెపై పాట పాడుతూ.. పక్కనే ఉన్న మోనాల్‌ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. కానీ మోనాల్‌ మాత్రం ఏమి విననట్లుగా నటించింది.

సోఫాలో కూర్చున్న అరియానా-హారిక అభిని ఆటపట్టించే ప్రయత్నం చేశారు. కానీ.. అభి మాత్రం వాళ్లకు రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో అభి తెలివికి ఒక్కింత షాక్‌ గురయ్యింది అరియానా. దీంతో అభి గురించి నాకు తెలుసు కాబట్టే ఆయనతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతా అని చెప్పుకొచ్చింది హారిక.

ప్రేక్షకులతో మరింత కనెక్ట్‌ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే మూడు రకాల టాస్క్‌లు ఇచ్చిన బిగ్‌బాస్‌.. నాల్గో టాస్క్‌గా వినోదాన్ని అందించే చాన్స్‌ ఇచ్చాడు. అఖిల్‌ని సంచాలకుడిగా నియమించాడు. అయితే ఈ టాస్క్‌లో విజేతగా నిలిచిన వారికి గోల్డెన్‌ మైక్‌ లభిస్తుంది.

మొదటి సారి మ్యూజిక్‌ ఆపేయగా.. అఖిల్‌తోపాటు మిగితా ఇంటి సభ్యులంతా అరియానాను దిగాల్సిందిగా కోరారు. అయితే ఇక్కడ అరియానా కొంచెం అతి చేసింది. ఇక అరియానా ఇప్పట్లో ఒప్పుకునేలా లేదనుకున్న అభిజిత్‌.. టాస్క్‌ కండీషన్‌ మర్చిపోయి కింద కూర్చున్నాడు. తనకు ఈ విషయం తెలియదన్న అభి.. పొరపాటు జరిగిపోయిందంటూ స్టేజీ దిగేశాడు.ఇక రెండోసారి మ్యూజిక్‌ ఆగినప్పుడు అరియానా దిగుతూ.. తనకు ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకులకు రిక్వెస్ట్‌ చేసుకునే చాన్స్‌ వచ్చిందని.., మిగితవారికి కూడా రావాలనే స్టేజీ దిగుతున్నానని చెప్పి దిగిపోయింది.

మూడోసారి మ్యూజిక్‌ ఆగినప్పుడు.. సోహైల్‌ తనకు డ్యాన్స్‌ చేయాలని ఉందని, కేవలం హౌస్‌మేట్స్‌ కోసమే దిగుతున్నానని చెప్పాడు. ఇక వాష్‌రూమ్‌ దగ్గరకు వెళ్లిన సోహైల్‌ అరియానాపై బిగ్‌బాస్‌కు కంప్లైంట్‌ ఇచ్చాడు. ఇదివరకు జరిగిన టాస్క్‌లో ఇంటి సభ్యుల కోసం త్యాగం చేయమంటే చేయని అరియానా.. ఇప్పుడు ఎందుకు ఇచ్చిందని తప్పుపట్టాడు.

స్టేజీపై చివరకు హారిక, మోనాల్‌ మాత్రమే మిగిలి ఉన్నారు. ఇద్దరిలో ఒకరు దిగాల్సిరావడంతో.. హారికను దిగాల్సిందిగా మోనాల్‌ రిక్వెస్ట్‌ చేసింది. ఒక్కనిమిషం ఆలోచించిన హారిక.. చివరకు గోల్డెన్‌ మైక్‌ను మోనాల్‌కు త్యాగం చేసింది. కెప్టెన్సీ టాస్క్‌లో గెలిపించావని.. అందుకే ఇప్పుడు ఈ చాన్స్‌ ఇస్తున్నా అని హారిక చెప్పి దిగిపోయింది.టాస్క్ గెలిచి గోల్డెన్‌ మైక్‌ సాధించిన మోనాల్‌.. కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లి ఓట్లు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్‌ చేసింది. అనంతరం గార్డెన్‌ ఏరియాకు వచ్చి సంతోషంతో బిగ్‌బాస్‌కు హగ్‌లు, ప్లైయింగ్‌ కిస్‌లు ఇచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories