హారిక ఓ సంచలనమంటూ బిగ్‌బాస్ కితాబు

హారిక ఓ సంచలనమంటూ బిగ్‌బాస్ కితాబు
x
Highlights

గ్రాండ్‌ ఫినాలే షోకి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. కంటెస్టెంట్లు ఇన్నాళ్లు ఎన్నో టాస్క్‌లను ఆడారు. ఎన్నో కష్టాలను చవి చూశారు. మరొన్ని అడ్డంకులను ఒడిదొడుకులను దాటుకొని చివరకు టాప్‌ 5కి చేరుకున్నారు.

గ్రాండ్‌ ఫినాలే షోకి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. కంటెస్టెంట్లు ఇన్నాళ్లు ఎన్నో టాస్క్‌లను ఆడారు. ఎన్నో కష్టాలను చవి చూశారు. మరొన్ని అడ్డంకులను ఒడిదొడుకులను దాటుకొని చివరకు టాప్‌ 5కి చేరుకున్నారు. అయితే ఇప్పుడు వారికి టార్గెట్లు, టాస్క్‌లు ఇవ్వకుండా వాళ్లను సంతోషపెట్టే పనిలో పడ్డాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్ల జ‌ర్నీ మజిలీని చూపిస్తూ.. ఖుషి చేస్తున్నారు. హౌస్‌లో వారు సాగించిన ప్రయాణాన్ని త‌నివితీరా వీక్షించి ఇన్నాళ్లు భరించిన కష్టాలను మరిచిపోయేలా చేశాడు. బుధవారం అఖిల్‌, అభిజిత్‌ ఎమోషనల్‌ జర్నీని చూపించి భావోద్వేగానికి గురిచేస్తే.. నిన్న హారిక, సోహైల్, అరినాయానా వీడియోలను అంతకుమించి అన్నట్లుగా చూపించారు. పైగా వారి గుణాలను సుగుణులను బిగ్‌బాస్ మెచ్చుకున్నాడు. మరీ ఎవరెవరినీ ఏమని మెచ్చుకున్నాడో ఇప్పుడు చుద్దాం.

హౌస్‌లో చోటుగా తనకంటే స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హారికను బిగ్‌బాస్‌ తెగ మెచ్చుకున్నాడు. చిన్న ప్యాకెట్‌ పెద్ద ధమాకా అనే కామెంట్ ను నిజం చేశావని కొనియాడారు. ఇక బిగ్‌బాస్‌ చూపించిన వీడియోను చూసిన హారిక మస్త్‌ ఫిదా అయ్యింది. ఇన్నాళ్లు పడిన కష్టం హుష్‌ కాకి అయ్యిందంటూ తెగ సంబురపడిపోయింది.

గార్డెన్ ఏరియాలోకి అడుగుపెట్టిన హారిక‌.. ఒక్కసారిగా అవాక్కయ్యింది. బ్రిలియంట్‌ సెట్టింగ్‌ అంటూ మురిసిపోయింది. తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ సాధించుకున్నారని బిగ్‌బాస్‌ అనడంతో ఎంతో మురిసిపోయింది. ఎవ‌రి స‌పోర్ట్ లేకున్నా.. ప‌ట్టుద‌ల‌, మొండితనంతో టాప్‌ -5 లో నిలిచారని బిగ్‌బాస్ అభినందించాడు. మిమ్మల్ని ఎన్ని మేఘాలు కప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. సూర్యకాంతిలా ఛేదించుకుంటూ ఫైనల్‌కి చేరుకున్నావని హారికను బిగ్‌బాస్‌ మెచ్చుకున్నాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో తన జర్నీని చూపించగానే.. హారిక భావోద్వేగానికి లోనైంది. టాస్క్‌ల్లో చిచ్చరపిడుగులా చెలరేగిపోవడం.. ఎనర్జిటిక‌ డ్యాన్స్‌లు, గొడవలు, గోలలు, కన్నీళ్లు తెప్పించిన సన్నివేశాలను చూసుకున్న హారిక కాస్త ఎమోషనల్‌ అయ్యింది. తనని తాను చూసుకుంటూ మురిసిపోయింది.

ఈ వీడియోను చూసిన హారిక ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యింది. 14 వారాల్లో ప్రతి రోజు ఎన్నో పాఠాలు నేర్పిందని గుర్తుచేసుకుంది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన బిగ్‌బాస్‌ను ఎప్పటికీ మరిచిపోను అంటూ ప్రకటించింది. రేపటి దినాన నేను ఉన్నా లేకపోయినా అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ అనేది మేజర్ రోల్ అని చెప్పింది.. ఏదో సాధించిన ఫీలింగ్‌ వస్తుందని మురిసిపోయింది హారిక.

చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనే వ్యాఖ్యాన్ని నిజం చేస్తూ ఫైనలిస్ట్‌గా నిలిచిన హారికకు బిగ్‌బాస్‌ అల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఎలివేషన్ కాంతులు రాగానే హారిక తన స్టైల్లో స్టెప్పులేసింది. సోహైల్‌ జర్నీ.. ఓ సినిమాను చూసిన ఫీలింగ్‌ను కలిగించింది. సోహైల్‌ మజిలీని చాలా ఎన్నోవేటీగా చూపించారు. అలాగే సోహైల్‌ ను బిగ్‌బాస్‌ అద్భుతంగా పొగిడారు. పక్కింటి వారిగా ప్రయాణం మొదలుపెట్టి.. పత్రి ఒక్కరి అభిమానాన్ని పొందావని బిగ్‌బాస్ గుర్తుచేశారు. అన్ని భావోద్వేగాలను పండిస్తూ.. స్నేహానికి కొత్త నిర్వచనం ఇచ్చావని బిగ్ బాస్ చెప్పగానే.. సోహైల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆటపై ఉండే సోహైల్ ధ్యాస, తాపత్రయానికి బిగ్‌బాస్‌ సెల్యూట్ చేశారు. మీ శ్రమ, ప్రతిభ, ఊరికే పోద‌ని, ఇకపై మీ క‌థ వేరేలా ఉంటుంద‌ని సోహైల్ డైలాగ్‌ను అత‌డికే అప్పజెప్పాడు బిగ్‌బాస్.. మీ ప్రతి ఎమోషన్ చాలా స్వచ్ఛంగా నిజమైనదిగా ఉంటుందన్నాడు బిగ్‌బాస్. చాలాసార్లు త్యాగాలు చేస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకుంటూ సాగించిన జర్నీని బిగ్ బాస్‌తో పాటు ప్రేక్షకులకు బాగా నచ్చిందన్నారు.

సోహైల్‌ జర్నీ వీడియో.. చూసే ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌కు గురిచేసింది. ఈ వీడియోలో బాధ‌, కోపం, స్నేహం, ప్రేమ అన్నింటినీ ప్రదర్శించాడు సోహైల్‌. పది సంవత్సరాల కష్టానికి వచ్చే ప్రతిఫలాన్ని 105 రోజుల్లో ఇచ్చారని సోహైల్‌ ప్రకటించాడు. ట్రోఫీ రాక‌పోయినా మ‌నసుకు సంతోషాన్నిచ్చారని, ఇది చాలంటూ ఉప్పొంగిపోయాడు. నాకు సినిమానే జీవితం బిగ్ బాస్.. జాబ్ చేయలేను.. బిజినెస్ చేసే తెలివిలేదు.. నాకు ఒక మంచి మార్గం చూపించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ఎలివేషన్స్‌ని ఆస్వాదిస్తూ.. జై సింగరేణి.. సింగరేణి ముద్దుబిడ్డా అని ఇస్మార్ట్ సోహైల్ నినాదాలు చేశాడు. హౌస్‌లోకి వెళ్తూ వెళ్తూ.. తన స్నేహితులు మెహ‌బూబ్‌, అఖిల్ ఉన్న ఫొటోల‌తో పాటు త‌న సింగిల్ ఫొటోను కూడా తీసుకున్నాడు సోహైల్.

బోల్డ్ యాంకర్‌గా బిగ్‌బాస్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ ఎమోషనల్ జర్నీని కూడా అద్భుతంగా ప్రదర్శించారు బిగ్ బాస్. 'అరియానా మీరు ఓ సంచలనం అంటూ బిగ్‌బాస్‌ మెచ్చుకున్నారు. అందరు నిందించినా.. ఒంటరిదానిని చేసినా. ధైర్యాన్ని తగ్గించకుండా నిలబడిన తీరుకు బిగ్‌బాస్‌ ఫిదా అయిపోయారు. హౌస్‌లో అరియానా.. ఓ షైనింగ్ స్టార్‌ అంటూ బిగ్‌బాస్ అభివర్ణించాడు. అందరు నిన్ను టార్కెట్‌ చేసినా.. రాజీ పడకుండా నీ గమ్యమే లక్ష్యంగా అడవి గుర్రంలా ముందుకు సాగావని బిగ్‌బాస్‌ కొనియాడారు. రోజు రోజుకీ మీలో ఉన్న నిజమైన ఆటను కనబరుస్తూ.. షైనింగ్ స్టార్‌గా ఎదిగివన్నారు బిగ్‌బాస్.

బిగ్‌బాస్ స్క్రీన్‌పై అరియానా జ‌ర్నీ నవరసాలను పండించింది. తాను హౌస్‌లో చేసిన అల్లరి, అవినాష్‌ను ఆటపట్టించిన తీరు, తనతో చెప్పిన కబుర్లు, సోహైల్‌తో గొడవకు దిగిన సన్నివేశాలు అబ్బురపరిచేసేలా చేశాయి. ఈ వీడియో క్లిప్ చూస్తే ఈ బోల్డ్ పిల్ల.. బెస్ట్ బేబీ అనిపించకమానదు. స‌మాజంలో త‌న‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చిన బిగ్‌బాస్‌కు అరియానా ధన్యవాదాలు తెలిపింది. లైఫ్‌లో మర్చిపోలేని స్థానం ఇచ్చారని.. బిగ్ బాస్ అరియానాగా గుర్తింపు తెచ్చారని చెప్పింది. ఎప్పటికీ బిగ్ బాస్‌ని మర్చిపోలేనని ఎమోషనల్ అయ్యింది అరియానా.

చివర్లో బిగ్ బాస్ అరియానాను అభినందిస్తూ క్రాకర్స్ కాల్చడంతో వాటిని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది అరియానా. అనంత‌రం అవినాష్ త‌న‌కు తినిపించిన ఫొటోతో పాటు బిగ్‌బాస్ ఇచ్చిన‌ చింటూ బొమ్మను హ‌త్తుకున్న ఫొటోను తీసుకుంది అరియానా.

Show Full Article
Print Article
Next Story
More Stories