Top
logo

Bigg Boss 4 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్.హౌస్ మేట్స్ మధ్య రగడ!

Bigg Boss 4 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్.హౌస్ మేట్స్ మధ్య రగడ!
X
Highlights

* కంటెస్టెంట్లకు నాగార్జున బంపరాఫర్‌ * హౌస్‌లో మరోసారి ఫ్యామిలీ ఎపిసోడ్‌ * అవినాష్‌ టాప్‌-2లో ఉండకూడదు-హారిక * అఖిల్‌, అభి మధ్య మరోసారి వాగ్వాదం * అభితో ఫ్రెండ్‌షిప్‌ వద్దనుకున్న సోహైల్‌ * అవినాష్‌ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడు-లాస్య * అవినాష్‌ను వెంటాడిన దురదృష్టం * మెహబూబ్‌కు బదులు మోనాల్‌ వెళ్లిపోవాల్సింది-అభి * నామినేషన్‌లో సోహైల్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటన

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పంతొమ్మింది కంటెస్టెంట్లు పాల్గొనగా.. పదకొండో వారం ముగింపుకు వచ్చేసరికి కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో అభిజిత్‌, సోహైల్‌, హారిక, అరియానా, మోనాల్‌, లాస్య నామినేషన్‌లో ఉండగా.. మోనాల్‌, లాస్య డేంజర్‌ జోన్‌లో ఉన్నారు.

కంటెస్టెంట్ల మధ్య పెరిగిపోతున్న దూరాలను హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కుటుంబసభ్యులు చెరిపేశారు. తమ పిల్లలతోపాటు మిగతా ఇంటి సభ్యుల మీద ప్రేమలు కురిపించారు. కళ్ల ముందు కమ్ముకున్న ఆవేశపు అపార్థాల పొరలు చీలిపోయి అభిజిత్‌, అఖిల్‌ అన్నదమ్ముల్లా కలిసిపోయారు. అటు సోహైల్‌, హారిక కూడా ఎప్పటిలాగే దోస్తులుగా మారిపోయారు.

హౌస్‌లో మరోసారి ఫ్యామిలీ ఎపిసోడ్‌ నడిచింది. కాకపోతే వచ్చినవారితో కూడా నాగార్జున గేమ్‌ ఆడించారు. ఎవరు టాప్‌-5లో ఉంటారో అంచనా వేయమన్నారు. దీంతో ఓరకంగా కంటెస్టెంట్లకు లాభమే జరిగింది.

అవినాష్‌ను దురదృష్టం వెంటాడింది. అతడి ఫ్యామిలీని కలుసుకునే ఛాన్స్‌ చేజేతులా పోగొట్టుకున్నాడు. ఇక మోనాల్ అమ్మ తన కూతురు తర్వాత అభిజిత్‌ ఇష్టమని చెప్పడంతో అఖిల్‌ ముఖం మాడిపోయింది. ఫైనల్‌గా సోహైల్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించారు నాగార్జున

కంటెస్టెంట్ల మధ్య పెరిగిపోతున్న దూరాలను హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కుటుంబసభ్యులు చెరిపేశారు. తమ పిల్లలతోపాటు మిగతా ఇంటి సభ్యుల మీద ప్రేమలు కురిపించారు. కళ్ల ముందు కమ్ముకున్న ఆవేశపు అపార్థాల పొరలు చీలిపోయి అభిజిత్‌, అఖిల్‌ అన్నదమ్ముల్లా కలిసిపోయారు. అటు సోహైల్‌, హారిక కూడా ఎప్పటిలాగే దోస్తులుగా మారిపోయారు.

గార్డెన్‌ ఏరియాలో ఒంటరిగా కూర్చున్న మోనాల్‌.. తనకు తానే ప్రశ్నలు వేసుకుంది. బిగ్‌బాస్‌ షోకు ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకుంది. తోటి సభ్యులతో ఫ్రెండ్‌ షిప్‌ కొనసాగించాలా..? లేదా..? అనే పలు విషయాలపై తనకు తానే ప్రశ్నలు వేసుకుని క్లారిటీ తెచ్చుకుంది. అటు హౌస్‌లో బూతులు మాట్లాడినందుకు గాను అఖిల్‌, సోహైల్‌కు ఎగ్స్‌ కట్‌ చేస్తూ హారిక పనిష్మెంట్‌ ఇచ్చింది.

తర్వాత ఇంటిసభ‌్యులకు బిగ్‌బాస్‌ రియల్‌ మ్యాంగో డ్రింక్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో అవినాష్‌-సోహైల్‌, లాస్య-అరియానా పాల్గొన్నారు. ఫైనల్‌గా అవినాష్‌ టాస్క్‌ పూర్తి చేసి విజేతగా నిలిచాడు. విజేతైన అయిన అవినాష్‌‌.. రియల్‌ మ్యాంగోకు చెందిన పది బాటిళ్లను గెలుచుకున్నాడు.

కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు నాగ్‌ కంటెస్టెంట్లకు బంఫరాఫర్‌ ప్రకటించాడు. తను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్తే వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడిస్తానని చెప్పారు. దీనికి ఇంటిసభ్యులు సరేనంటూ తలాడించారు. మొదటగా హారిక వంతు రాగా.. నాగ్‌ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. దీంతో స్టేజీపైకి వచ్చిన హారిక అన్నయ్య, స్నేహితుడుతో నాగ్‌ గేమ్‌ ఆడించారు.

హౌస్‌లో మరోసారి ఫ్యామిలీ ఎపిసోడ్‌ నడిచింది. కాకపోతే వచ్చినవారితో కూడా నాగార్జున గేమ్‌ ఆడించారు. ఎవరు టాప్‌-5లో ఉంటారో అంచనా వేయమన్నారు. దీంతో ఓరకంగా కంటెస్టెంట్లకు లాభమే జరిగింది.

ఇక బి‌గ్‌బాస్‌ ఇంట్లో ముందు ఒకలాగా, వెనుక ఒకలాగా ప్రవర్తించేది ఎవరు అన్న ప్రశ్నకు అభిజిత్‌ అని అఖిల్‌ ఆన్సర్‌ ఇచ్చాడు. తర్వాత అఖిల్‌ అన్న బబ్లూ, ఆయన కొడుకు అరుష్‌ స్టేజీ మీదకు వచ్చారు. సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌తోపాటు అరియానా, అవినాష్‌ టాప్‌ 5లో ఉంటారని బబ్లూ అభిప్రాయపడ్డాడు.

షో కోసం అన్నివిధాలా తమ వంతు కృషి చేయనిది ఎవరన్న ప్రశ్నకు అరియానా మోనాల్‌ అని చెప్పింది. తర్వాత అరియాన చెల్లి ముగ్గు, స్నేహితుడు కార్తీక్‌ వచ్చారు. నువ్వు ఏడవకు, నన్ను ఏడిపించకు అని అరియానా చెల్లి ఆమెతో చెప్పింది.

ఇక‌ సేఫ్ గేమ్ ఆడుతూ ఇంత‌వ‌ర‌కు నెట్టుకొచ్చింది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు లాస్య అవినాష్ పేరు చెప్పింది. దీంతో స్టేజీ మీద‌కు వ‌చ్చిన లాస్య త‌ల్లి శాంత‌మ్మ‌ త‌న కూతురు షోకు వ‌చ్చాక‌ ఎన్నో షాకులిచ్చింద‌ని తెలిపింది. లాస్య‌, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌, హారిక టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చింది.

అవినాష్‌ను దురదృష్టం వెంటాడింది. అతడి ఫ్యామిలీని కలుసుకునే ఛాన్స్‌ చేజేతులా పోగొట్టుకున్నాడు. ఇక మోనాల్ అమ్మ తన కూతురు తర్వాత అభిజిత్‌ ఇష్టమని చెప్పడంతో అఖిల్‌ ముఖం మాడిపోయింది. ఫైనల్‌గా సోహైల్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించారు నాగార్జున.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాక ఇంటిస‌భ్యుల్లో ఎవ‌రితో స్నేహాన్ని కొన‌సాగించ‌వు..? అన్న ప్ర‌శ్న‌కు సోహైల్ అభిజిత్ పేరు చెప్పాడు. దీంతో సోహైల్ బ్ర‌ద‌ర్స్ స‌బిల్‌, రామారావు స్టేజీ మీద‌కు వ‌చ్చారు. సోహైల్‌, అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చారు. రాత్రి తొమ్మిది త‌ర్వాత నుంచి ఒంటి గంట వ‌ర‌కు సోహైల్‌‌ అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడ‌ని చెప్పడంతో అంద‌రూ షాక‌య్యారు.

త‌ర్వాత అవినాష్‌.. అంద‌రిక‌న్నా లాస్య సెల్ఫిష్ అని చెప్పాడు. కానీ స‌రైన కార‌ణం చెప్ప‌క‌పోవ‌డంతో అత‌డి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను స్టేజీ మీద‌కు రాకుండా వెనుదిరిగి పోయారు. ఇక పోయిన వారం మోహబూబ్‌కు బదులు ఎవరు ఎలిమినేట్‌ కావాల్సింది అన్న ప్రశ్నకు.. మోనాల్‌ అని అభి సమాధానమిచ్చాడు. ఇక వద్దనగానే అతడి లవ్‌ స్టోరీని తన మామ ఏమీ లేదంటూ దాట వేశారు.

ఇంట్లో ఎవరిని నమ్మకుండా ఉంటే బాగుండేది అనుకున్నావు అన్న ప్రశ్నకు మోనాల్‌ అభిజి‌త్‌ పేరు చెప్పింది. స్టేజీ మీదకు వచ్చిన మోనాల్‌ తల్లి నాగ్‌కు గిఫ్ట్‌ ఇచ్చింది. అంతేకాక‌ త‌న‌కు అభిజిత్ ఫేవరె‌ట్ అని చెప్పింది.

టాప్ 5 ఓట్లు త‌క్కువగా ప‌డ్డ ముగ్గురు కంటెస్టెంట్లు వారికి ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను స్టోర్ రూమ్‌లో పెట్టాల‌ని నాగార్జున ఆదేశించారు. దీంతో లాస్య‌.. జున్ను ఫొటో, అవినాష్.. ప‌ర్ఫ్యూమ్‌, మోనాల్ త‌న స్పెష‌ల్ గిఫ్ట్‌ను పంపించేశారు. త‌ర్వాత సోహైల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు నాగార్జున.

Web Titlebiggboss-4-telugu-11th weekend episode-21st-november-highlights-contestants-family-members-appeared with Nagarjuna
Next Story