Bigg Boss 5 Promo: మూడు హగ్గులు.. ఆరు గొడవలతో సాగుతున్న శన్ను, సిరి ప్రయాణం

Bigg Boss Telugu Season 5 Wednesday Episode Promo Today 08th December 2021 | Bigg Boss 5 Updates
x

Bigg Boss 5 Promo: మూడు హగ్గులు.. ఆరు గొడవలతో సాగుతున్న శన్ను, సిరి ప్రయాణం(ఫోటో: స్టార్ మా)

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. రోల్ ప్లే టాస్క్ లో సన్నీ, మానస్ ఇద్దరూ తమ వేషధారణతో పాటు కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించగా బుధవారం ఎపిసోడ్ లో మరోసారి సన్నీ.. హమీదా పాత్రలో, మానస్.. శ్రీరామ్ పాత్రలో కనిపించబోతున్నారు. సన్నీ లాంగ్ ఫ్రాక్ లో శ్రీరామ్ దగ్గరికి వెళ్లి కామెడీ చేశాడు. కాలు ఎలా ఉంది అంటూ గట్టిగా నొక్కేశాడు. "వామ్మో గట్టిగా నొక్కేస్తున్నాడ్రోయ్" అని అరుస్తూ కామెడీ చేశాడు.

ఇక సిరితో శన్ముఖ్ జస్వంత్ మళ్లీ గొడవపడి ఒంటరిగా కూర్చుంటే సిరి హనుమంత్ అతని దగ్గర కూర్చుని ఉంది. షన్ను కోపంగా "నిన్ను అప్పడం అంటే నేను నిన్ను డిఫెండ్ చేశాను. మీ తల్లి వచ్చి హగ్ గురించి మాట్లాడారు. నేను నెగిటివ్ అవ్వట్లేదిక్కడ, నేను నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను" అంటూ సిరి హనుమంత్ కి శన్ను క్లాసు పీకాడు. "మిగతా ఇంటి సభ్యులు ఎంతో నువ్వు కూడా నాకు అంతే, నా దగ్గరి నుండి వెళ్లిపో.. నా నెత్తి మీద ఎక్కకు నువ్వు" అంటూ సిరిపై అరవడం ప్రోమోలో చూడవచ్చు. రోజంతా ఎంత గొడవ పెట్టుకున్న మళ్ళీ ఒక్క హాగ్ తో ఇద్దరూ కలిపోతారులే అంటూ శన్ముఖ్, సిరి హనుమంత్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories