Bigg Boss 5 Highlights: శన్ముఖ్ కి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న సిరికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss Telugu Season 5 Wednesday Episode Highlights 15th December 2021 | Bigg Boss 5 Updates
x

బిగ్ బాస్ తెలుగు(ఫోటో: స్టార్ మా)

Highlights

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం(15/12/2021) ఎపిసోడ్ హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ లో భాగంగా సన్నీ తన ఎమోషనల్ జర్నీ గురించి ఇంటి సభ్యులతో చెప్పాడు. బిగ్ బాస్ ఇచ్చిన కేకును తెచ్చి మిగతా ఇంటి సభ్యులతో పంచుకున్నాడు. ఆ తరువాత ఇంటి సభ్యులంతా దాగుడు మూతల ఆట ఆడారు. అనంతరం విజే సన్నీ.. గత కొన్ని వారాలుగా నిర్వహించిన టాస్కులను, ఇంటి సభ్యులను గుర్తు తెచ్చుకుంటూ సరదాగా ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. సన్నీ, మానస్‌లు చిన్న పిల్లల ఆట ఆడుకున్నారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. శ్రీరామ్ ఆట తనకు నచ్చదని తెలిపాడు. శ్రీరామ్ అన్నీ ఆలోచించి ఆడతాడని తెలిపాడు.

ఆ తర్వాత సిరి హనుమంత్ కి తన జర్నీ వీడియో చూసే అవకాశం లభించింది. బిగ్ బాస్.. సిరి హనుమంత్ తో మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇంట్లో అందరి కంటే ముందుగా ప్రయాణం మొదలుపెట్టారు. అల్లరి పిల్లగా.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే సిరిగా మీరు అందరికీ పరిచయం. మీకు మీరుగా సిరి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్‌గా మొదలైన మీ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. మీ పోటీదారులు మీ కంటే బలంగా ఉన్నా..వెనుకడుగు వేయకుండా మీ తెలివి తేటలు, ధైర్యంతో చివరి వరకు ఉండటానికి చేసిన ప్రయత్నం ఎందరినో మెప్పించింది. కానీ, ఎన్నోసార్లు.. ఎమోషనల్‌తో కన్నీరు పెట్టుకున్నారు.

పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట మీ విషయంలో నిజమని అందరికీ నిరూపించారు. ఈ బిగ్‌బాస్‌ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు' అంటూ బిగ్‌బాస్‌ చెప్పారు.ఆ తర్వాత సిరి హనుమంత్ ఐదారు ఫొటోలు తీసుకొచ్చేసింది. శన్ముఖ్ తో కలిసి డ్యాన్స్‌ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చింది. శన్ముఖ్ కి సర్‌ప్రైజ్‌ ఇద్దామని దాన్ని డైనింగ్‌ టేబుల్‌పై దాచిపెట్టింది కానీ ఇంతలో బిగ్‌బాస్‌ అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా తీసుకొని వెళ్ళడంతో సిరి బాధపడింది. ఆ తరువాత బిగ్ బాస్.. హౌస్ మేట్స్ తాము ఎంపిక చేసుకున్న ఫొటోల గురించి చెప్పాలని కోరాడు.

మానస్ మాట్లాడుతూ.. "టెడ్డీబేర్‌ టాస్కులో గెలిచాక నేను, ఆనీ మాస్టర్‌, సన్నీ గెలిచాక సంతోషంతో హగ్ చేసుకున్నామని" ఆ ఫొటో వెనకాల స్టోరీని చెప్పుకొచ్చాడు.

సన్నీ మాట్లాడుతూ.. బేటన్‌ టాస్కులో నా టీమ్‌ వాళ్లే నన్ను వరస్ట్‌ పెర్ఫర్మార్ అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్‌ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు.అందరినీ నవ్వించడమే తన నినాదంగా పేర్కొన్నాడు.

శన్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయంటే.. అది అమ్మ రాసిన లెటర్‌ కళ్ల ముందే ముక్కలైన సమయంలో ఎంతో బాధపడినట్లు తెలిపాడు.

సిరి హనుమంత్ మాట్లాడుతూ.. "బ్రిక్స్‌ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. ఆ టాస్క్‌కు ముందే శన్ముఖ్ జస్వంత్ ని ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నానని, బ్రిక్స్‌ ఛాలెంజ్‌ టాస్క్‌లో అది తప్పని శన్ముఖ్ నిరూపించాడని తెలిపింది.

శ్రీరామ్ మాట్లాడుతూ.. "నేనెప్పుడూ చెప్పలేదు కానీ.. హమీదాను చాలా మిస్సవుతున్నాని ఆమె ఉంటే లోన్‌ రేంజర్‌ అనే పేరు వచ్చేది కాదు, ఈ జర్నీలో ఆమెని మిస్ అవుతున్నానని" తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories