Bigg Boss 5 Highlights: ప్రియాంక చేసిన పనికి నడవలేని స్థితిలో శ్రీరామచంద్ర

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)
* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం(02/12/2021) ఎపిసోడ్ హైలైట్స్
Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవల్‌లో ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్‌లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే ఇతర ఇంటి సభ్యుల బకెట్‌లో ఉన్న బంతులను తీసుకోవాలి. ఈ ఐస్ ఛాలెంజ్ లో భాగంగా విజే సన్నీ, సిరి హనుమంత్ ల మధ్య గొడవ మొదలైంది. సిరి హనుమంత్ నన్ను కావాలనే టార్గెట్ చేసి అందరి ముందు చెడుగా చూపించాలని ప్రయత్నిస్తుందని సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో రవి.. ఐ మిస్ యూ అంటూ సిరి హనుమంత్ ఏడవడంతో పాటు నీకోసమే ఆడుతున్నా రవి అంటూ శన్ముఖ్ జస్వంత్ అరవడం చూసి ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.
ఐస్ బకెట్ నుంచి కాళ్లు తీయకుండా నిల్చోవడంతో సిరి కాళ్లు పట్టేసుకోవడంతో ఆట ముగిసిన తరువాత మానస్ ఆమెను ఎత్తుకుని మెడికల్ రూమ్ కి తీసుకురావడం చూసి శన్ముఖ్ జస్వంత్ సిరిపై కోపంతో ఊగిపోయాడు. వాళ్ళ సహాయం తీసుకోవడం ఎందుకని ఇలా అయితే నా ఫ్రెండ్ గా ఉండొద్దని అనడంతో సిరి కన్నీళ్ళు పెట్టుకుంది.
ఇక ఐస్ వాటర్ నుంచి బయటకు వచ్చిన ఇంటి సభ్యులకు కాళ్ళపై వేడినీళ్లు పోయడం ప్రమాదమని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోని ప్రియాంక సింగ్.. శ్రీరామచంద్రకు అర్ధరాత్రి జండూ భామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేయడంతో శ్రీరామచంద్ర నొప్పి మరింత ఎక్కువైంది. వెంటనే శ్రీరామచంద్రని మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులుఇచ్చారు. ఇలా ప్రియాంక సింగ్ చేసిన పనికి మానస్, ఆర్జే కాజల్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇలా జరుగుతుందని అనుకోలేదని శ్రీరామచంద్రకు ప్రియాంక సింగ్క్షమాపణలు చెప్పింది. ఆమె చేసిన ఆ తప్పు వల్ల శ్రీరామచంద్ర బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
ఫైనల్‌గా తొలి రౌండ్‌లో సన్నీ ఆధిక్యంలో ఉండగా ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్ చివరి స్థానాల్లో నిలిచారు. ఫోకస్ అనే రెండో టాస్క్ లో బజర్ మోగినప్పుడు ఇంటి సభ్యుడు 29 నిమిషాలు లెక్కించి గంటకొట్టాలి. ఎవరైతే 29 నిమిషాలు లేదా అంతకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్ మోగిస్తారో వారు ఈ టాస్క్ లో గెలిచినట్లు.
ఈ గేమ్‌లో సన్నీకి మానస్ సాయం కోరగా అతడు అందుకు ఓకే చెప్పేశాడు. దీంతో మానస్ లెక్కపెడుతున్నాడులేనని రిలాక్స్ అయిన సన్నీ.. చివరకు మానస్ చెప్పిన వెంటనే బెల్ మోగించాడు. ఆ తర్వాత సన్నీ జోకర్‌లా రెడీ అయి బెడ్ పైనే నడవలేని స్థితిలో ఉన్న శ్రీరామచంద్రని నవ్వించాడు.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT