Bigg Boss 5 Highlights: "ఇది ఫ్రెండ్షిప్ హాగ్ ఆంటీ" అంటూ సిరి, శన్నుకి సన్నీ కౌంటర్

Bigg Boss Telugu Season 5 Tuesday Episode Highlights 07th December 2021 | Bigg Boss 5 Updates
x

Bigg Boss 5 Highlights: "ఇది ఫ్రెండ్ షిప్ హాగ్ ఆంటీ" అంటూ సిరి, శన్నుకి సన్నీ కౌంటర్(ఫోటో: స్టార్ మా)

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మంగళవారం (07/12/2021) ఎపిసోడ్ హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ ముందుగా ఇంటి సభ్యులకు ఒక లగ్జరీ ఐటెం టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న గులాబ్ జామున్ లను చేతితో ముట్టుకోకుండా నోటితో ఎవరైతే ముందుగా తినేస్తారో ఆ ఇంటి సభ్యుడికి ఒక స్పెషల్ లగ్జరీ బడ్జెట్ ఐటెం దక్కుతుందని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో సిరి హనుమంత్ అందరికంటే ముందుగా పూర్తి చేయడంతో సన్నీ షాక్ అయ్యాడు. ఆ తరువాత శన్ముఖ్ జస్వంత్ సిరి హనుమంత్ తో మాట్లాడుతూ 'నేను సీరియస్ గా చూసినప్పుడు నువ్వు గేమ్ ఆడు' అని చెప్పడంతో ఇప్పుడెందుకు చెప్పావు అని సిరి హనుమంత్ అడగడంతో 'చెప్తున్నా విను' అని శన్ముఖ్ అంటాడు.

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సరదాగా ఒక రోల్ ప్లే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు వేరే సభ్యుల్లా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వారు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకుంటారని బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ మొదట సిరి హనుమంత్ - విజే సన్నీ అప్పడం టాస్క్ ను ఇచ్చాడు. ఇందులో విజే సన్నీ.. శన్ముఖ్ జస్వంత్ గా, సిరి హనుమంత్.. సన్నీగా, శన్ముఖ్ జస్వంత్.. సిరి హనుమంత్ పాత్రలో, మానస్.. ఆనీ మాస్టర్ గా, శ్రీరామచంద్ర.. కాజల్ గా నటించారు.

సన్నీ.. శన్ముఖ్ పాత్రని చేస్తూ సిరి పాత్రలో ఉన్న శన్ముఖ్ జస్వంత్ ని మాటి మాటికి హగ్ చేసుకుంటూ రారా అంటూ హగ్‌ చేసుకుంటూ ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ శన్ముఖ్ - సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేస్తూ కావాల్సినంత కామెడీ ఇచ్చారు. చివర్లో సిరి హనుమంత్.. సన్నీ యాక్టింగ్ చూడలేక... రేయ్ వదలెండెహే.. ఆ సీన్‌లో హగ్‌లు ఎక్కడ ఉన్నాయ్ రా అంటూ పాత్రలో నుంచి బయటకు వచ్చేటంత పెర్ఫామెన్స్ ఇచ్చాడు సన్నీ. ఇక సమయం దొరికింది కదా అని నేను చపాతీ గాడ్నీ.., పులిహోర గాడ్ని అంటూ పర్సనల్ ఎమోషన్స్ అన్నీ శన్ముఖ్ జస్వంత్ పాత్ర రూపంలో బయటపెట్టేశాడు సన్నీ.

ఇక నవ్వించడం రాక నవ్వించిన వాళ్ళని వెకిలి చేశావని మొదటి నుండి మొత్తుకునే శన్ముఖ్ జస్వంత్ మంగళవారం ఎపిసోడ్ లో కూడా సన్నీ చేసిన కామెడీని వెకిలి అంటూ పాతపాటే పాడాడు. కేవలం ఫన్ కోసం అలా చేశానని, నిన్ను హర్ట్ చేసే ఉద్దేశం లేదని' సన్నీ శన్ముఖ్ జస్వంత్ కి సారీ చెప్తూ.. హగ్ చేసుకున్నాడు.

ఆ తరువాత బిగ్ బాస్ ప్రియాంక సింగ్ - మానస్ ల మధ్య ప్రయాణాన్ని రోల్ ప్లే చేయమని చెప్పాడు. విజే సన్నీ.. ప్రియాంక సింగ్ గెటప్ వేయగా.., కాజల్.. మానస్ గెటప్ తీసుకుంది. ఇక సన్నీకి లంగావోణీ కట్టి, విగ్గు పెట్టి రెడీ చేయడంతో హౌస్ మేట్స్ అంతా పడి పడి నవ్వుకున్నారు.

ఇక మానస్ మాట్లాడుతూ "మీరు గబ్బు చేశారంటే మాత్రం మంచిగా ఉండదు ముందే చెప్తున్నా" అని వార్నింగ్ ఇచ్చాడు. 'ఎట్లా వస్తే అట్లా వస్తాది రా భాయ్ ఆగు' అని సన్నీ అనడంతో 'ఎంటర్టైనింగ్ గా చేయాలిరా' అని ఆర్జే కాజల్ చెప్పడంతో మానస్ "ఎంటర్టైనింగ్ గా చెయ్యు.. నువ్వు ఏందీ వంద సార్లు ఐలవ్యూ.. ఎవడు చెప్పిండు ఐలవ్యూ" అని ఆర్జే కాజల్ మీదికి మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో "నేను మానస్ క్యారెక్టర్ చేయను" అంటూ ఏడ్చుకుంటూ కాజల్ అక్కడ నుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత మానస్.. ప్రియాంక సింగ్ గెటప్ వేయగా, విజే సన్నీ.. మానస్ గెటప్ వేశాడు. కాజల్.. సన్నీ గెటప్ వేసింది. శ్రీరామచంద్ర.. లోబో గెటప్ వేశాడు. కాసేపు వీరంతా తమ నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు. మానస్ గెటప్ లో ఉన్న సన్నీ ప్రేమగా అన్నం కలిపి పింకీకి తినిపించాడు. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తో "నీతో ఎప్పటికీ స్నేహం చేస్తానని.. ఏం కష్టమొచ్చినా ముందుంటానని" చెప్పడంతో కాజల్ నిజంగానే ఎమోషనల్ అవడంతో ముగ్గురూ ప్రేమగా కౌగిలించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories