logo
సినిమా

Bigg Boss 5 Promo: "జై బాలయ్య" అంటున్న సన్నీ.. "గబ్బర్ సింగ్" గా మానస్

Bigg Boss Telugu Season 5 Thursday Episode Promo 09th December 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Highlights

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం(09/12/2021) ప్రోమో విడుదల

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురువారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఓటు అప్పీల్ చేసే అర్హత గెలుచుకోడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మూడో అవకాశం ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు ఎంచుకున్న సూపర్ స్టార్స్ లా వ్యవహరించాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం ప్రోమో చూడవచ్చు. ఇందులో విజే సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, మానస్.. పవన్ కళ్యాణ్, శన్ముఖ్ జస్వంత్.. వెంకటేష్, ఆర్జే కాజల్.. శ్రీదేవి, సిరి హనుమంత్.. జెనీలియా పాత్రల్లో కనిపించనున్నారు.

టాస్క్ లో విజే సన్నీ తనకి ఇచ్చిన బాలయ్య పాత్రతో మరోసారి డైలాగ్స్ తో పాటు డాన్స్ తో ఆకట్టుకున్నాడు. గబ్బర్ సింగ్ పాటకు మానస్ డాన్స్ తో, ముఠా మేస్త్రిగా శ్రీరామ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇక అంతకు ముందు ప్రోమోలో శ్రీరామచంద్ర.. మానస్ తో మాట్లాడుతున్న సమయంలో ఆర్జే కాజల్ మధ్యలో మాట్లాడటంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. గేమ్ లో గెలవకుండా మాట్లాడుతావని శ్రీరామ్ అనగా.., ముందు నువ్వే స్టార్ట్ చేశావని.. ఒక సందర్భంలో శ్రీరామ్ ని "బ్రో" అని కాజల్ అనడంతో నేను నీకు బ్రో కాదు అల అనొద్దు అంటూ ఫైర్ అవడం ప్రోమోలో చూడవచ్చు.


Web TitleBigg Boss Telugu Season 5 Thursday Episode Promo Today 09th December 2021 | Bigg Boss 5 Updates
Next Story