ఆట తక్కువ.. హగ్ లు ఎక్కువ.. మళ్ళీ మొదలెట్టారంటూ సిరి, శన్నుపై నెటిజన్ల ట్రోల్స్

Bigg Boss Telugu Season 5 Shanmukh Jaswanth and Siri Hanumanth News | Bigg Boss 5 Updates
x

Bigg Boss 5: ఆట తక్కువ.. హగ్ లు ఎక్కువ.. మళ్ళీ మొదలెట్టారు.. సిరి, శన్నుపై నెటిజన్ల ట్రోల్స్

Highlights

* శన్ను, సిరి హనుమంత్ ఇలాగే చేస్తే కష్టమే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్

Bigg Boss 5: బిగ్ బాస్ 5 లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంత్, శన్ముఖ్ జస్వంత్ షో మొదలైన మొదటి వారం నుండి అలకలతో, ఏడుపులతో, హగ్ లతో తమ ఆటతో ఆకట్టుకోలేక వాళ్ళు చేసే అతితో బుల్లితెర ప్రేక్షకులకు చికాకు తెప్పించారు.. తెప్పిస్తున్నారు.. అటు ప్రేక్షకులకే కాకుండా సిరి హనుమంత్ తల్లికి కూడా శన్ముఖ్ జస్వంత్ ని హగ్ చేసుకోవడం నచ్చలేదని ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో శన్ముఖ్ జస్వంత్ మొహం మీదే చెప్పడం చూశాము. ఆ మాటతో హర్ట్ అయి ఎక్కి ఎక్కి ఏడ్చేసిన శన్ను..ఒకటి రెండు రోజులు సిరి హనుమంత్ తో సరిగ్గా మాట్లాడక అంటిముట్టనట్టుగానే ఉన్నాడు.

తాజాగా సోమవారం ఎపిసోడ్ లో దీప్తి సునయన నా వైపు కూడా నిన్ను చూడనివ్వదని, నా విషయంలో తాను సీరియస్ గా ఉంటుందని చెప్పడంతో అయితే ఎవరికి గొప్ప అంటూ బాధపడుతూ వెళ్ళిపోతుంది సిరి. ఆ తరువాత మొజ్ రూమ్ లో ఒకరికొకరు సారీ చెప్పుకొని మరోసారి శన్ముఖ్ జస్వంత్ వద్దంటున్న ఇది ఫ్రెండ్షిప్ హగ్ అని బిగ్ బాస్ కి గుచ్చి గుచ్చి చెబుతూ హగ్ చేసుకోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సిరి హనుమంత్ తల్లి అంతగా చెప్పినా.. ఆమెలో మార్పు రాకపోవడం అంతేకాకుండా సోమవారం ఇచ్చింది ఫ్రెండ్షిప్ హగ్ అని పదే పదే చెప్పిన వీరిద్దరు.. మరి అంతకు ముందు ఇచ్చిన హగ్ కి అర్ధం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

గతవారం ప్రసారమైన వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జునతో కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడిన సిరి హనుమంత్ తప్పు అని తెలుస్తున్న ఏదో కనెక్షన్ వస్తుందని చెప్పడం..శన్ను మాట్లాడకపోతే తల బాదుకోవడం చూస్తే శన్ముఖ్ జస్వంత్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సిరి హనుమంత్ మాత్రం ప్రియాంక సింగ్ ని సోమవారం నామినేట్ చేస్తూ ఎవరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవకు.., నీ గేమ్ పై ఫోకస్ చెయ్యు అని సలహా ఇవ్వడం ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. సిరితో కనెక్షన్ కట్ చేసుకోకుండా ఇలాగే కొనసాగితే మాత్రం ఇప్పటికే పడిపోయిన శన్ముఖ్ జస్వంత్ గ్రాఫ్ మరింత పడిపోక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories