Bigg Boss 5 Highlights: బయటికి వెళ్ళాక మనోడు "హగ్ గురు" అయిపోతాడు.. శన్ముఖ్ పై సన్నీ కామెంట్స్

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శనివారం (18/12/2021) ఎపిసోడ్ హైలైట్స్
Bigg Boss 5 Highlights: ఆదివారం ప్రసారం కానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి కానుంది. ఇక ఇప్పటికే టాప్ 5 లో నిలిచిన విజే సన్నీ, శ్రీరామ్, శన్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హనుమంత్ లలో ఎవరు విజేత అనేది నేడు(ఆదివారం) తేలనుంది. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ గత సీజన్లలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న కొంతమంది ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూమ్ లోకి బిగ్ బాస్ పంపించారు.
మొదటి సీజన్ విజేత శివబాలాజీతో పాటు కంటెస్టెంట్ హరితేజ కన్ఫెషన్ రూమ్ లో నుండి ఇంటి సభ్యులతో మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్వించారు. శన్ముఖ్ జస్వంత్ తో శివబాలాజీ మాట్లాడుతూ "ఎక్కువ ఆలోచించొద్దు.. అన్నీ మర్చిపో" అని అనడంతో దానికి హరితేజ "ట్రోఫీ కూడా మర్చిపో అని చెప్పి సీజన్ 1 లో టైటిల్ తీసుకెళ్లిపోయాడు. చివరికి శివబాలాజీ గెలిచాడంటూ చప్పట్లు కొడుతున్నాను" అంటూ హరితేజ పంచ్ వేసింది.
రెండో సీజన్ నుంచి గీతామాధురితో పాటు రోల్ రిడా కన్ఫెషన్ రూమ్ లో నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడారు. ముందుగా రోల్ రైడా.. "బయట ఎక్కడన్నా ఏదైనా ఎగురుతుంటే అది ట్రాక్టర్ ట్రాక్టర్ అని అంటున్నారు" అంటూ సిరి హనుమంత్ ని ఆటపట్టించాడు. సన్నీ- మానస్ మధ్య ఫ్రెండ్షిప్ ని పొగిడారు. ఆ తరువాత కంటెస్టెంట్స్ తో ఫిక్షన్ సాంగ్ గేమ్ ఆడించారు.
మూడో సీజన్ నుంచి శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్ లు కన్ఫెషన్ రూమ్ లో నుండి ఇంటి సభ్యులతో మాట్లాడారు. టాప్ 5 కంటెస్టెంట్స్ లలో ఉన్న ఒక్కొక్కరిని పొగుడుతూ కామెంట్స్ చేశారు. ఇక ఇంటి సభ్యులతో హీలియం బెలూన్స్ ను పీల్చమని చెప్పి వారితో డైలాగ్స్ చెప్పించి మంచి ఫన్ ఇచ్చారు.
నాలుగో సీజన్ నుంచి అఖిల్, అరియానా బిగ్ బాస్ లు కన్ఫెషన్ రూమ్ నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడారు. "నెవర్ ఐ హేవ్ ఎవర్" అనే గేమ్ ఆడించారు. డేటింగ్ యాప్ లో ఎవరినైనా కలిశారా..? అని హౌస్ మేట్స్ ని ప్రశ్నించగా "ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కాని ఆమె నా ముచ్చట వదిలేసి తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెబుతూ పోయింది. అదొక పంచాయితీ అయింది" అని సన్నీ చెప్పుకొచ్చాడు.
ఇక అంతకు ముందు శన్ముఖ్ జస్వంత్.. సిరి హనుమంత్ తో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి వీరి ముగ్గురికి బాగా కాలుతుందని.. నెక్స్ట్ నుంచి ఒక్కొక్కరికి రాడ్స్ వేస్తానని.. శ్రీరామ్, సన్నీ, మానస్ లను ఉద్దేశిస్తూ అన్నాడు. "ఇది రెస్పాండ్ అయ్యే టైం కాదు.. విని పడేసే టైం" అని చెప్పింది సిరి. ఏ రిలేషన్ అయినా బిగ్‌బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. రోజులాగే సిరికి హగ్ ఇచ్చి శన్ముఖ్ కూల్ చేశాడు. అది చూసిన సన్నీ.. "ఏంట్రా వీళ్లు.. ఎప్పుడు ఏం ఎమోషన్ వస్తాదో.. హగ్ గురు అయిపోతాడు చూడు మనోడు బయటకి వెళ్లాక" అని మానస్ తో విజె సన్నీ కామెంట్ చేశాడు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT