logo
సినిమా

BB5 Highlights: సన్నీ, శన్ముఖ్ మినహా నామినేషన్ లో ఇంటిసభ్యులు

Bigg Boss Telugu Season 5 Monday Episode Highlights Today 29th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం(30/11/2021) ఎపిసోడ్ హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియకి ముందు ఇంటి సభ్యులు రవి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. శన్ముఖ్ జస్వంత్ టాప్ 3 లో రవి నిలుస్తాడని అనుకున్నానని అన్నాడు. ఇంటి సభ్యుల్లో ఎవరు ఎలిమినేట్ అయిన అంతగా బాధపదలేదని కాని రవి వెళ్లిపోతున్న సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యానని సిరి హనుమంత్ చెప్పింది. ఇక శ్రీరామచంద్ర రవి టాప్ 2 లో ఉంటాడని ఊహించనని అతడి ఎలిమినేషన్ షాక్ గురి చేసింది అన్నట్టుగా శన్ముఖ్ జస్వంత్ తో చెప్పుకొచ్చాడు.

మరోపక్క ప్రియాంక సింగ్ కూడా రవి ఎలిమినేషన్ తో బాధపడుతున్న సమయంలో శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ లు ఆమెని మానస్, సన్నీ, ఆర్జే కాజల్ నుండి డైవర్ట్ చేయడానికి తమ మాటలతో బాగానే ప్రయత్నించారు. ఇక 13వ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను బిగ్ బాస్ గేటు బయటకు తన్నాలి. ఈ నామినేషన్ ప్రక్రియలో మొదటగా కెప్టెన్‌ శన్ముఖ్ జస్వంత్ కాజల్‌ను కమ్యూనిటీ పేరు తీయడం నచ్చలేదని నామినేట్‌ చేశాడు. ఆ తరువాత ప్రియాంకను నామినేట్‌ చేస్తూ ఆమె ముఖం ఉన్న బంతిని తన్ని నామినేట్ చేశాడు.

తరువాత వచ్చిన ప్రియాంక సింగ్ ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయడం ఇష్టం లేదని అందుకు తన వద్ద కారణాలు కూడా లేవని సమయం వృథా చేయగా బిగ్‌బాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌ లో ఇద్దరు ఇంటి సభ్యుల పేరు తెలుపకపోతే నేరుగా నామినేట్‌ అవుతావని ప్రియాంక సింగ్ ని హెచ్చరించాడు.ఇక చేసేదేమిలేక ప్రియాంక సింగ్.. కాజల్‌ తో పాటు సిరి హనుమంత్ ని నామినేట్ చేసింది. శ్రీరామచంద్ర.. మానస్‌, కాజల్‌ను నామినేట్‌ చేశాడు. సిరి హనుమంత్.. ఇతర ఇంటి సభ్యులతో ఎమోషనల్ గా కనెక్ట్ అవకుండా గేమ్ పై ఫోకస్ చేయమని ప్రియాంక సింగ్ ముఖం ఉన్న బంతిని తన్ని ఆమెని నామినేట్ చేసింది.

ప్రియాంక సింగ్ విషయంలో కమ్యూనిటీ పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్‌ చేసింది. విజే సన్నీ, మానస్‌ ఇద్దరూ సిరి హనుమంత్ తో పాటు శ్రీరామచంద్రలను నామినేట్‌ చేశారు. ఇక చివరగా ఆర్జే కాజల్ నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు అని పదే పదే ఒక కారణాన్ని చెప్పి నన్ను నామినేట్ చేయడం నచ్చలేదని చెప్తూ‌ ఆర్జే కాజల్.. సిరి హనుమంత్, ప్రియాంక సింగ్ ను నామినేట్‌ చేసింది. మొత్తానికి 13వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ శన్ముఖ్ జస్వంత్, విజే సన్నీ మినహా సిరి హనుమంత్, మానస్‌, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర‌, కాజల్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Web TitleBigg Boss Telugu Season 5 Monday Episode Highlights Today 29th November 2021 | Bigg Boss 5 Updates
Next Story