Bigg Boss 5 Highlights: "అప్నా టైం ఆయేగా".. సన్నీ ఎమోషనల్ జర్నీ

Bigg Boss Telugu Season 5 Monday Episode Highlights 14th December 2021 | Bigg Boss 5 Updates
x

Bigg Boss 5 Highlights: "అప్నా టైం ఆయేగా".. సన్నీ ఎమోషనల్ జర్నీ(ఫోటో: స్టార్ మా)

Highlights

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఎపిసోడ్ మంగళవారం 15/12/2021 హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ లో భాగంగా శన్ముఖ్ జస్వంత్, విజే సన్నీల జర్నీ వీడియోని బిగ్ బాస్ చూపించారు. ముందుగా శన్ముఖ్ జస్వంత్ ని గార్డెన్ ఏరియాకి పిలిచిన బిగ్ బాస్ అతనికి సంబంధించిన ఫోటోలను చూపించాడు. అందులో ఎక్కువగా మోజ్‌ రూం ఫోటోలే ఉండడంతో మోజ్ రూం అంటూ శన్ముఖ్ జస్వంత్ కేకలు వేశాడు‌.

మీరు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి పోటీలా నిలిచారు. ఇక్కడ నిజమైన మనుషులు, విభిన్న వ్యక్తిత్వాలు, కోపం, ప్రేమ ఇలా ప్రతి ఒక్కటి నిక్కచ్చిగా ఉంటాయి. అలాంటి అర్థం చేసుకునే స్నేహితులు నీకు ఈ ఇంట్లో దొరికారు. మీ కోపాన్ని, అసహనాన్ని దూదిలాగా పీల్చుకుంటూనే నీలోని నిప్పుని నిరంతరం వెలిగిస్తూ ముందుకు తీసుకొచ్చారు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అవ్వడమే కాకుండా అందరితో బ్రహ్మ అనిపించుకున్నావు. ఈ ఇంట్లో మీకు ఇష్టమైన చోటు మోజ్ రూమ్ అని బిగ్ బాస్ కి తెలుసు శన్ముఖ్. అక్కడ మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు.. మీలోని కోపం, బాధ మరియు ప్రేమ అన్నింటినీ మోజ్ రూమ్ చూసింది.

ఒక్కోవారం మీ చుట్టూ ఉన్న మనుషులను, వారి ఆటను అంచనా వేస్తూ మీదైన శైలిలో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఆటను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. మీ తీరులో ఆటను ఒక్కో లెవెల్ దాటించి ఫినాలే వరకు తీసుకొచ్చారని బిగ్ బాస్ అన్నారు. ఆ తరువాత శన్ముఖ్ జస్వంత్ జర్నీని వీడియోని బిగ్ బాస్ చూపించారు. వీడియో చూసిన తరువాత శన్ముఖ్ జస్వంత్ తన తల్లితో ఉన్న ఫోటోని తీసుకొని వెళ్ళాడు.

ఆ తరువాత విజె సన్నీని గార్డెన్ ఏరియాకి పిలిచిన బిగ్ బాస్ ఫోటోలతో సర్ ప్రైజ్ చేశాడు. ఇక సన్నీతో బిగ్ బాస్ మాట్లాడుతూ.. సన్నీ "సరదా, సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలు అవుతాయని బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ షో చూస్తున్న అందరికీ మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు, మిమ్మల్ని కోరుకునే స్నేహితులు, గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం, ఎన్నో జ్ఞాపకాలు ఇలా అన్నీ కలిపి మిమ్మల్ని మీరు ఒక కొత్త మనిషిలా అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చి బెస్ట్ ఎంటర్టైనర్ గా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు నిలబడ్డ తీరు.. మిమ్మల్ని వారు ఇష్టపడ్డా, లేకపోయినా ప్రతీ ఒక్కరినీ మీలోని ఒక స్నేహితుడు పలకరించాడు. ఈ ప్రయాణం మీకు ఈజీగా మొదలవ్వలేదు. ప్రారంభంలోనే మీ కోసం మీకు ఇబ్బందులను తీసుకొచ్చినా ఒక్కొక్క రోజు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగారు.

బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో గెలవాలనే మీ తపన.. గెలిచే వరకూ పోరాడే పట్టుదల.. ఎవరు ఎన్నివిధాలుగా మాట్లాడినా.. మీ ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాగించిన ప్రయాణమే మళ్లీ గుర్తు చేస్తుంది. మీరు వెతుకున్న స్వప్న సుందరి కూడా మీకు త్వరలోనే దొరకాలని బిగ్‌బాస్‌ కోరుకుంటున్నట్లు తెలిపాడు.

అప్నా టైమ్ ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీ ఇప్పుడు మీ సమయం వచ్చేసింది" అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్. తన జర్నీ వీడియో చూసిన సన్నీకి కన్నీళ్లు ఆగలేదు. బిగ్ బాస్ కి థాంక్స్ చెబుతూ.. ఇప్పటివరకు తెలిసి.. తెలియక చేసిన తప్పులను క్షమించండని.., తనను ఈ స్టేజ్ వరకు వచ్చేలా చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఆ తరువాత సన్నీ తన తల్లితో పాటు మానస్ తో ఉన్న ఫోటోలను తన వెంట తీసుకెళ్ళాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories