Bigg Boss 5 Highlights: బరాబర్ గెలుస్తా.. అమ్మకు కప్ ఇస్తా - సన్నీ

Bigg Boss 5 Highlights (ఫోటో: స్టార్ మా)
* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 100వ ఎపిసోడ్ హైలైట్స్
Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం 100 వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే టాప్ 5 లో నిలిచిన ఇంటి సభ్యులు విజే సన్నీ, సిరి హనుమంత్, మానస్, శ్రీరామ్, శన్ముఖ్ జస్వంత్ లు మరో ఐదు రోజుల్లో జరిగే గ్రాండ్ ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ లో భాగంగా విజే సన్నీ - మానస్ ఇద్దరు బిగ్ బాస్ టైటిల్ గురించి మాట్లాడుకున్నారు. సన్నీ.. మానస్ తో మాట్లాడుతూ "టెన్షన్‌గా ఉంది మచా... గేమ్‌కు దగ్గర్లో ఉన్నాం.. ఇంకో వారం మచా.. ఇది ఎట్లాగైనా గెలవాలి. ఇది నా డ్రీమ్. మా అమ్మకు కప్పిస్తా. ఏదైనా చేసి బరాబర్ ఇస్తా" అని తన విజయంపై సన్నీ ధీమా వ్యక్తం చేశాడు.
శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ మాట్లాడుతూ "జెస్సీగాడు మాకు రాడ్ వేసేశాడు. వాడు కొట్టడం ఒక్కటే తక్కువ. వాడు మాకు హింట్ ఇచ్చాడు" అని అనడంతో.. "14 వారాల తర్వాత హింట్ ఏంటి బ్రో.. 2వ వారం నుండి హింట్ ఇస్తూనే ఉన్నారు. చూసుకుందాంలే అని పట్టించుకోలేదు" అని శ్రీరామ్ అన్నాడు.
అనంతరం బిగ్‌బాస్ ఫైనలిస్టుల జర్నీని అటు ఫోటోలతో పాటు వీడియోతో కళ్లకు కట్టినట్లు చూపించాడు. మొదటి ఫైనలిస్టు శ్రీరామ్‌ను గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ఎంతో సంతోషపడిపోయాడు. ఆ తరువాత బిగ్ బాస్ శ్రీరామ్ తో మాట్లాడుతూ "ఎంతోమంది మనసులకు నీ గొంతు ఎంతో దగ్గర. ఈసారి మీ మనసును వారికి పరిచయం చేయడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. మీపాటతోనే కాకుండా మీ మాటతోను, ఆటతోను లక్షల మందిని పలకరించే అవకాశం బిగ్ బాస్ హౌస్ ఇచ్చింది. హౌస్ ఎంత మంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా.. మీరు మాత్రం వన్ మ్యాన్ ఆర్మీలా మీరు మీ లక్ష్యం వైపు వెళ్లారు" అని తెలిపాడు. తరువాత శ్రీరామ్ తనస్ చెల్లితో ఉన్న ఒక ఫోటోని తీసుకొని వెళ్ళాడు.
ఇక తరువాతి ఫైనలిస్ట్ మానస్ తో బిగ్ బాస్ మాట్లాడుతూ "మానస్.. అమ్మ ముద్దుల కొడుకుగా.., మమాస్ బాయ్‌గా ఇంట్లో అడుగుపెట్టారు. స్నేహానికి మీరు ఇచ్చే విలువ వారి కోసం చివరి వరకు మీరు నిలబడిన తీరు ప్రతి ఒక్కరి గుండెని హత్తుకుంది. కొందరు తెలివితో ఆడతారు.., కొందరు మనసుతో ఆడతారు. మనసు,తెలివి రెండిటినీ ఉపయోగించి ఆడటం మాత్రం మీతోనే సాధ్యమని అదే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిందని బిగ్ బాస్ తెలిపాడు. ఇక మానస్.. అమ్మతో పాటు సన్నీతో ఉన్న ఫొటోలను తనతో తీసుకెళ్లాడు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT