నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలని మా అమ్మ కోరిక.. సపోర్ట్ చేయడంటూ సన్నీ రిక్వెస్ట్

నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలని మా అమ్మ కోరిక.. సపోర్ట్ చేయడంటూ సన్నీ రిక్వెస్ట్
x
Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం(10/12/2021) ఎపిసోడ్ హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ ఓటు అప్పీల్ కోసం ఇంటి సభ్యులకు ఇచ్చిన ఒక 'అంగుళీకం' టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లోభాగంగా సన్నీ.. బాలయ్యగా, 'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ గా మానస్, శన్ముఖ్ జస్వంత్.. 'సింగం' సూర్యగా, 'ముఠామేస్త్రి'లో చిరంజీవిగా శ్రీరామ్, ఆర్జే కాజల్..శ్రీదేవి గెటప్ లో, సిరి హనుమంత్.. జెనీలియా పాత్రల్లో నటించారు. ఈ మొత్తం టాస్క్ లో ఆర్జే కాజల్ ని బెస్ట్ పెర్ఫార్మర్ గా ఇంటి సభ్యులు ఎంచుకోవడంతో ఆమెకిప్రేక్షకులను ఓటింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం లభించింది. ఇక ప్రేక్షకులతో మాట్లాడిన కాజల్.. తన స్నేహితులతో పాటు టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నానని దయచేసి ఓట్లు వేయమని కోరింది. తనతో పాటు మానస్, సన్నీలకు కూడా ఓట్లు వేయమని కోరింది.

ఇంటి సభ్యులు అందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.., ఎవరైతే నిజాయితీగా ఎలాంటి ముసుగు లేకుండా సమాధానం చెప్పారని ఇంటి సభ్యులు భావిస్తారో వారికి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం వస్తుందని బిగ్ బాస్ చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు.

మొదటగా సిరి హనుమంత్ ని "మీరు శన్ముఖ్ జస్వంత్ కన్నా స్ట్రాంగ్‌ ప్లేయర్‌. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సిడర్ చేసుకోవడం లేదని అడిగిన ప్రశ్నకి సిరి హనుమంత్ సమాధానం ఇస్తూ "నేను స్ట్రాంగ్‌ ప్లేయర్‌నే. కాకపోతే కొన్ని సందర్భాల్లో నాకు శన్ముఖ్ చాలా హెల్ప్ చేశాడని.. తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని, ఒక ఫ్రెండ్‌గా నేను శన్ముఖ్ ని టాప్ ప్లేస్ లో చూడాలనుకున్నానని" చెప్పింది.

యానీ మాస్టర్‌తో రెస్పెక్ట్‌ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని విజె సన్నీ మీద కొట్టడం రెస్పెక్టా? అని కాజల్ కి అడిగిన ప్రశ్నకి ఆమె మాట్లాడుతూ "సన్నీ దగ్గర నాకు ఉన్న చనువుతోనే అలా సరదాగా చేశానని.., సన్నీ అంటే నాకు చాలా గౌరవం ఉందని చెప్పింది.

గిల్టీ బోర్డ్‌ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్‌ అయ్యారు? ఆ సంఘటన తర్వాత మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా తిరిగి పొందారనే ప్రశ్న సన్నీకి ఎదురవడంతో "గిల్టీ బోర్డ్‌ వేసుకోవడమనేది ఈ సీజన్‌లోనే నేను బాగా హర్టయిన సంఘటన. నా కోపం వల్లే ఇంటి సభ్యులు ఆ బోర్డు వేశారు. ఆ తరువాత జనాల నుంచి వచ్చిన ధైర్యం, కొన్ని టాస్క్ లలో, వీకెండ్స్ లో వచ్చిన కాంప్లిమెంట్స్ కాన్ఫిడెన్స్ పెరిగేలా చేశాయని సన్నీ సమాధానం చెప్పాడు.

జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు శన్ముఖ్ జస్వంత్ ఇమ్మెచ్యూర్‌ అని మీరు చెప్పారు. కానీ ర్యాంకింగ్‌ టాస్క్‌లో మీరే శన్ముఖ్ మెచ్యూర్‌ అని, తనను సెకండ్‌ ప్లేస్‌లో పెట్టారు.మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు శన్ను గ్రూపులో ఉన్నారా? అని శ్రీరామ్ ని అడిగిన ప్రశ్నకి ఇప్పుడు తెలిసిన షణ్ముఖ్‌ వేరు.. ప్రస్తుతం షణ్ను చాలా మెచ్యూర్ అని తాను ఏ గ్రూప్ లో లేను అని సమాధానం ఇస్తాడు.

ప్రేక్షకుల దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని స్నేహితుడిలా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? అని మానస్ ని అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ "వాడుకోవడమనేది తప్పు‌. హౌస్ లో నేను నిజాయితీగా కనెక్ట్‌ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తాడు? ఒకల్ని వాడుకొని పైకి ఎదగాలనే మనస్తత్వం సన్నీకి లేదని చెప్తాడు.

సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్‌ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్‌ చేస్తున్నారు. తనని తనలా ఎందుకు ఉండనివ్వరు? అని శన్ముఖ్ జస్వంత్ కి ప్రశ్న ఎదురవడంతో "ఇది నేనూ ఊహించాను. నేను పొసెసివ్‌గా ఫీల్‌ అవుతున్నానని నాకూ తెలుసు. కానీ ఏది కంట్రోల్‌ చేస్తున్నానో, ఏది పొసెసివ్‌గా ఫీల్‌ అవుతున్నానో నాకే తెలియడం లేదు. నన్ను నాకన్నా ఎక్కువ తనే అర్థం చేసుకుంటుంది. తనమీద ఎవరైనా గేమ్‌ ఆడాలనుకుంటే తప్పకుండా కంట్రోల్‌ చేస్తాను. ఎందుకంటే ఆమెను టాప్‌ 5లో చూడాలనుకుంటున్నానని శన్ముఖ్ సమాధానం చెప్తాడు.

ఈ మొత్తం టాస్క్ లో నిజాయితీగా సమాధానం చెప్పిన ఒక వ్యక్తిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకోమని బిగ్ బాస్ చెప్పడంతో సన్నీకి, సిరి హనుమంత్ కి సమానంగా ఓట్లు రావడంతో శ్రీరామ్ ఓటు కీలకంగా మారింది. అతడు సిరి పేరు చెప్పడంతో సన్నీకి శ్రీరామ్ కి మధ్య డిస్కషన్ జరిగింది. 'నేను అగ్రెసివ్‌ కాదు, టాస్కుల్లో వంద శాతం ఇస్తున్నాను. నాకోసం కప్పు గెలుచుకొని రారా అని అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. అది నెరవేర్చలేకపోతే బాధపడతాను. నాకీ అవకాశమిచ్చిన సిరికి సపోర్ట్‌ చేయండి. ప్లీజ్‌ వోట్‌ ఫర్‌ మీ' అని సన్నీ కోరాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories