logo
సినిమా

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి రాబోతున్న చీఫ్ గెస్టులు వీళ్ళే..!!

Bigg Boss Telugu Season 5 Chief Guests for Grand Finale | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి రాబోతున్న చీఫ్ గెస్టులు వీళ్ళే..!!

Highlights

Bigg Boss Telugu 5: డిసెంబర్ 19న జరగబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్టులుగా బాలీవుడ్ స్ట...

Bigg Boss Telugu 5: డిసెంబర్ 19న జరగబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్టులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకునేతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ నటి అలియా భట్ లు హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3,4 లలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావడంతో సీజన్ 5 కూడా చిరంజీవి వస్తారని మొదట వార్తలు వినిపించినా తాజాగా చిరు స్థానంలో చిరుత (చిరు తనయుడు) రాబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే జనవరి 7న విడుదల కానున్న "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్, అలియా భట్ లు గెస్టులుగా వస్తుండగా.., రణవీర్ సింగ్, దీపిక పదుకునే జంటగా నటించిన "83" సినిమా డిసెంబర్ 24న విడుదల అవుతుండటంతో పాటు ఈ సినిమాకి సంబంధించి తెలుగు రైట్స్ కింగ్ నాగార్జున సొంతం చేసుకోవడం కూడా బిగ్ బాస్ సీజన్ 5 కి ఈ స్టార్ కపుల్ గెస్టులుగా రావడానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రాల ప్రమోషన్ తో పాటు పాన్ ఇండియా స్టార్ లు అతిధులుగా విచ్చేస్తుండటంతో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ తో రికార్డులు బద్దలుకొట్టబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Web TitleBigg Boss Telugu Season 5 Chief Guests for Grand Finale | Bigg Boss 5 Updates
Next Story