'బిగ్ బాస్ 3'లో సందడి చేయబోయేది వీరేనా?

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు.
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు. నాని హోస్టింగ్ సీజన్ మొత్తం ఆకట్టుకుంది. 'బిగ్ బాస్' .. 'బిగ్ బాస్ 2' షోలు బాగా పాప్యులర్ కావడంతో, 'బిగ్ బాస్ 3' కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో 'బిగ్ బాస్ 3' షోను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోయేది వీరేనంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.
అందులో రేణు దేశాయ్, గద్దె సింధూర, శోభిత ధూళిపాల, వరుణ్ సందేశ్, ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ పొట్టి నరేశ్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ జాహ్నవి(మహాతల్లి) ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా చిరంజీవిగానీ .. వెంకటేశ్ గాని వ్యవహరించవచ్చని తెలుస్తోంది. క్రితంసారి ఈ షోకి సంబంధించిన విషయాలు కొన్ని ముందుగానే లీక్ కావడం నిర్వాహకులను ఇబ్బంది పెట్టింది. అందువలన ఈ సారి అలాంటివేం జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT