Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్‏లో బిగ్ ట్విస్ట్.. రెండో వారం అనూహ్యంగా ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్?

Bigg Boss 9 Telugu Elimination
x

Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్‏లో బిగ్ ట్విస్ట్.. రెండో వారం అనూహ్యంగా ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్?

Highlights

Bigg Boss 9 Telugu Elimination: తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రెండో వారం ప్రియా, మర్యాద మనీష్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. మరికొన్ని గంటల్లో ఒక హౌస్‌మేట్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రానున్నారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌లో, మొదటి వారంలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు రెండో వారం ఎవరు బయటకు వెళ్తారనేది ఉత్కంఠగా మారింది.

నాగార్జున క్లాస్.. ఎలిమినేషన్‌లో కొత్త ట్విస్ట్!

తాజా సమాచారం ప్రకారం, శనివారం హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం మొత్తం వారు చేసిన తప్పులను వీడియోల రూపంలో చూపించి మరీ నిలదీసినట్లు సమాచారం. ఇది హౌస్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది.

రెండో వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్‌లో ఉన్నారు. వారు భరణి, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ. ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం, భరణి, సుమన్ శెట్టి మంచి ఓటింగ్ సాధించారు. ముఖ్యంగా, సుమన్ శెట్టి అమాయకత్వం, నిజాయితీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారని, అందుకే అతడు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడని సమాచారం. భరణి, డీమాన్ పవన్, ఫ్లోరా షైనీ, హరిత హరీష్‌లకు కూడా సానుకూలంగానే ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.

డేంజర్ జోన్‌లో ఉన్నది వీరేనా?

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రెండో వారం ప్రియా, మర్యాద మనీష్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని, మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

అయితే, ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ ప్రేక్షకుల అంచనాలను ఏ విధంగా తలకిందులు చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories