Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు కలిసొచ్చిన వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా.?

Bigg Boss 8 Telugu
x

Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు కలిసొచ్చిన వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా.?

Highlights

Bigg Boss 8 Telugu: ఈ సీజన్‌లో టేస్టీ తేజ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 8 వారాల పాటు తేజ హౌజ్‌లో సందడి చేశాడు.

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 చివరి దశకు చేరుకుంటోంది. ఒక్కొక్కరు హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్న నేపథ్యంలో ఈ సీజన్‌ టైటిల్‌ విజేత ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టాప్‌ 5లో ఎవరు నిలుస్తారన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది. కాగా తాగా టేస్టీ తేజ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. నిజానికి ప్రృథ్వీ, అవినాష్‌లకు కూడా తక్కువ ఓటింగ్స్ వచ్చినా అనూహ్యంగా తేజ హౌజ్‌ నుంచి వెళ్లిపోక తప్పలేదు.

కాగా ఈ సీజన్‌లో టేస్టీ తేజ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 8 వారాల పాటు తేజ హౌజ్‌లో సందడి చేశాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తేజ ఎలిమినేట్‌ కావడంతో ఆయన ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడన్న చర్చ సాగుతోంది. టేస్టీ తేజ వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సీజన్‌కు గాను తేజకు బిగ్‌బాస్‌ రూ. 30 లక్షల పారితోషం తీసుకున్నట్లు తెఉలస్తోంది.

అయితే టేస్టీ తేజ గతంలో సీజన్‌ 7లో కూడా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన 9 వారాలకు గాను రూ. 13 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ లెక్క చూసుకుంటే ఈసారి తేజకు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ కలిసొచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే 13వ వారం హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ టాస్క్‌ను బాగా ఉపయోగించుకున్న అవినాష్‌ టాప్ 5లోకి మెదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. దీంతో ఓటింగ్‌ తక్కువగా వచ్చిన ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. మెగా చీప్ రోహిణి తప్ప మిగతా 8 మంది కంటెస్టెంట్ అందరూ నామినేషన్ లో నిలిచారు. ఇక వీరికి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణలు టాప్ 4 లో నిలవగా.. విష్ణు ప్రియ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories