Bigg Boss 5 Promo: "పని చెయ్యు.. ప్రతిఫలం ఆశించకు" అంటున్న అతిథులు

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం(11/11/2021) ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 12 Nov 2021 3:03 PM IST
Bigg Boss Telugu 5 Thursday Episode Promo 10 11 2021
X

Bigg Boss 5 Promo: పని చెయ్యు.. ప్రతిఫలం ఆశించకు అంటున్న అతిధులు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 లో గురువారం ఎపిసోడ్ లో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన బిబి హోటల్ టాస్క్ లో విజె సన్నీ మరోసారి తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. బుధవారం జరిగిన ఎపిసోడ్ లో బిబి హోటల్ లోకి అతిధిగా ఎంట్రీ ఇచ్చిన సన్నీతో పాటు డాన్ కూతురుగా హోటల్ లోకి అడుగుపెట్టిన సిరి హనుమంత్ లు వారికి ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు.

గురువారం ఎపిసోడ్ లో కూడా విజె సన్నీ, సిరి అదే జోష్ ని కొనసాగించగా, టాస్క్ లో భాగంగా బిబి హోటల్ కు హనీమూన్ కి వచ్చిన ప్రియాంక సింగ్ - మానస్ జంటను సన్నీ డిస్టర్బ్ చేస్తూ అటు హోటల్ సిబ్బందికి నయా పైసా కూడా ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో డబ్బు ఇస్తేనే సర్వీస్ చేయాలని హోటల్ సిబ్బంది నిర్ణయం తీసుకుంటారు. ఇక హోటల్ సిబ్బంది సర్వీస్ చేయడం నిలిపివేసిన తరువాత అతిధులుగా ఉన్న సిరి, కాజల్ లు వారికి తెలియకుండా దొంగతనంగా ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ ని తీసుకొని తినడం ప్రోమోలో చూశాము.

మొత్తానికి బిబి హోటల్ లో హోటల్ సిబ్బందితో అతిథుల ప్రవర్తన మాత్రం పని చెయ్యు ప్రతిఫలం ఆశించకు అన్న మాదిరిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఇంట్లో జరిగే మొత్తం ఎపిసోడ్ ని సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీ చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story