logo
సినిమా

BB5 - Nagarjuna: శన్ముఖ్.. దీప్తి కావాలనుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపో

Bigg Boss Telugu 5 Saturday Weekend Episode Promo Released Today 20 11 2021
X

BB5 - Nagarjuna: శన్ముఖ్.. దీప్తి కావాలనుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపో

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 వీకెండ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంటి సభ్యులు ఈవారంలో చేసిన కొన్ని తప్పులను సరిదిద్దడానికి హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్ లో మాట్లాడుతూనే ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. మొదట సిరి హనుమంత్ ఇటీవల శన్ముఖ్ జస్వంత్ తనతో మాట్లాడట్లేదని, ప్రతిసారి కావాలనే తనని దూరం పెడుతున్నాడని అలగడంతో పాటు తనకు తాను హర్ట్ చేసుకోవడంపై స్పందించాడు నాగార్జున.

కోట్లమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని.., వారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారో అని భయపడకూడదని అసలు అలా తనని తాను బాధించుకోవడానికి కారణం ఏంటో చెప్పమని అడగగా అలా ఎందుకు చేస్తున్నానో అర్ధం అవట్లేదని.. నా స్టొరీ నాకు తెలుసు.. నేను బయట ఏంటో తెలుసు కాని ఇక్కడ ఎందుకు అలా కనెక్షన్ వస్తుందో తెలియట్లేదని సిరి హనుమంత్ చెప్తుంది.

ఇక ఆ తరువాత శన్ముఖ్ జస్వంత్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున.. అసలు అలా డల్ ఎందుకు అయిపోయావని అని అడగగా ఏమో సర్ మానసికంగా వీక్ అయిపోయానని, దీప్తి సునయనని మిస్ అవుతున్నానని ఆమె చాలా గుర్తువస్తుందంటూ చెప్పడంతో వెంటనే నాగార్జున బిగ్ బాస్ హౌస్ గేట్స్ ఓపెన్ చేయమని చెప్పడం.. దీప్తిని మిస్ అవుతున్న అనుకుంటే ఇంటి నుండి బయటికి వెళ్ళాలని చెప్పడంతో శన్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా షాక్ అవడం ప్రోమోలో చూశాము.

Web TitleBigg Boss Telugu 5 Saturday Weekend Episode Promo Released Today 20th November 2021 | Bigg Boss 5 Updates Bigg Boss
Next Story